Telangana: ఆన్లైన్ ఎడ్యుకేషన్ సెంటర్‌గా మారిన స్మశానం.. బ్రతుకులు ముగిసే చోట అతడు జీవితాన్ని వెతుక్కుంటున్నాడు

|

Sep 16, 2021 | 8:58 AM

మహబూబాబాద్ జిల్లాలో ఓ వైకుంఠ ధామం ఆన్ లైన్ చదువుల నిలయంగా మారిపోయింది. సెల్‌ఫోన్‌కు సిగ్నల్ లేకపోవడంతో ఆ విద్యార్థికి వైకుంఠ ధామమే దిక్కయింది.

Telangana: ఆన్లైన్ ఎడ్యుకేషన్ సెంటర్‌గా మారిన స్మశానం.. బ్రతుకులు ముగిసే చోట అతడు జీవితాన్ని వెతుక్కుంటున్నాడు
Graveyard
Follow us on

మహబూబాబాద్ జిల్లాలో ఓ వైకుంఠ ధామం ఆన్ లైన్ చదువుల నిలయంగా మారిపోయింది. సెల్‌ఫోన్‌కు సిగ్నల్ లేకపోవడంతో ఆ విద్యార్థికి వైకుంఠ ధామమే దిక్కయింది. గంగారం మండలం మడగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రోహిత్ అనే యువకుడు మధ్యప్రదేశ్‌లోని ఓరియంటల్ వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ సెకండ్ ఇయర్ చదవుతున్నాడు. కరోనా కారణంగా ఆ రాష్ట్రంలో కళాశాలలు క్లోజ్ చేశారు. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే వాటిని వినేందుకు రోహిత్  ఫోన్‌లో సిగ్నల్ సహకరించడం లేదు. అతడు సిగ్నల్ కోసం వెతకని ప్రాంతం లేదు. చివరికు మడగూడెం శివారులోని వైకుంఠ ధామంలో సిగ్నల్ వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే కూర్చొని వైకుంఠ ధామంతో ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు. చదువు మీదున్న ఆసక్తితో శవాలను దహనం చేసేచోటే ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే క్లాసులు వింటున్నాడు రోహిత్. బ్రతుకులు ముగిసే చోట.. అతడు తన జీవితానికి వెలుగులు వెతుక్కుంటున్నాడు. ఎంత చిత్రమో కదా..!

ప్రస్తుతం కరోనా కల్లోలంలో ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా తారసపడ్డాయి. కొందరు చెట్లు ఎక్కి చదువుకోడాలు.. మరికొందరు పొలాల్లోనే పాకలు వేసుకుని ఉద్యోగాలు చేసిన ఘటనలు కూడా కంటపడ్డాయి. మాయదారి కరోనా.. మనుషుల్ని చూడండి… ఎన్ని తిప్పలు పెడుతుందో. మరి ఇది పూర్తిగా మనల్ని వెళ్లిపోతుందా..? లేదా జీవితాంతం సహజీవనం తప్పదా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. బ్రతుకులను తీసుకెళ్లడమే కాదు.. చాలా జీవితాలను  కరోనా డిస్టర్బ్ చేసేసింది.

Also Read: నిందితుడు రాజు ఆచూకి కోసం ఆ ప్రాంతంపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. ప్రతి వీధిలోనూ తనిఖీ

 పెళ్లి కాకముందే ప్రసవం.. నిమిషాల్లోనే తల్లీ, బిడ్డ మృతి.. తండ్రి కోసం పోలీసుల వేట..