bullock cart gift :పెళ్లిళ్ల సందర్భాల్లో ఎటువంటి కానుకలనిస్తారో మనకు తెలిసిన విషయమే. వీటిలో… ఖరీదైనవి, సాధారణమైనవి, వింతగొలిపేవి… ఇలా రకరకాలుగా ఉంటాయి. కొందరైతే… చిలిపిగా ఉండేందుకు రకరకాల కానుకలు ఇస్తుంటారని వింటూంటాం. అయితే… తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కానుకలుగా చేతివృత్తులు, వ్యవసాయ పనిముట్లను బహుమతిగా ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. తాజా ఓ వరుడికి ఎడ్లబండిని వరకట్నం కింద ఇచ్చారు వధువు బంధువులు.
పెళ్లిలో కట్నం కింద నచ్చిన వాహనమో..అడిగినంత డబ్బులు ఇవ్వడమో పరిపాటి. ఇందుకు భిన్నంగా ఆదివాసీల సంప్రదాయాలు ముందుచూపుతో కూడుకుని ఉంటాయి. పెళ్లిలో వరుడికి కానుకగా ఎడ్లు, ఎడ్లబండి ఇచ్చిన ఘటన కుమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఇటీవల చోటుచేసుకుంది. జైసూర్ మండల కేంద్రంలోని కాశీపటేల్‌గూడాకు చెందిన మెస్రం శేకు తనయుడు నగేష్‌కు నార్నూర్ మండలం ఖైర్‌డాట్వా గ్రామానికి చెందిన సూర్యారావు కూతురు రేణుకాతో శుక్రవారం వివాహం చేశారు. నగేష్ పెద్దగా చదువుకోలేదు. అయినప్పటికీ కూతురుతో పాటు కట్న కానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అంతేకాదు, తన అల్లుడి వ్యవసాయ పనుల అవసరాలకు ఉపయోగపడుతుందని భావించి ఎడ్ల బండి జతను పెళ్లి కానుకగా బహుకరించారు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది గమ్మత్తుగా ఉన్నా కుల వృత్తులకు అనుగుణంగా కానుకలు ఇవ్వడం గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందుకు సంబందించి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Read Also…
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళా సామ్రాజ్ఞి రజియా సుల్తాన్ సమాధిపై గందరగోళం!