పాలకోవా తయారీలో 160 ఏళ్ల చరిత్ర ఉన్న షాప్.. బ్రిటన్ రాణి విక్టోరియా ఇష్టపడిన ప్రపంచ ప్రసిద్దిగాంచిన మధుర పెడ గురించి తెలుసా..

|

Aug 29, 2024 | 3:34 PM

భారతదేశం నుంచి బ్రిటిష్ వారు తమ దేశానికి అనేక వస్తువులను, సంపదను తరలించుకుని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే వస్తువు విలువైన కోహినూర్ వజ్రం గురించి కాదు. అది తినదగిన వస్తువు 'మధుర పెడా' అంటే పాలకోవ అన్నమాట. భారతదేశంలో ఒక పాలకోవా తయారీ దుకాణం ఉంది. ఇది 160 సంవత్సరాలకు పైగా నడుస్తోంది. ఇక్కడ తయారు చేసిన పాల కోవా ఒకప్పుడు బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన డైనింగ్ టేబుల్‌ మీద ఉండేది. ఈ పాలకోవ తయారీ దుకాణం బ్రజ్ ప్రాంతంలో ఉంది.

పాలకోవా తయారీలో 160 ఏళ్ల చరిత్ర ఉన్న షాప్.. బ్రిటన్ రాణి విక్టోరియా ఇష్టపడిన ప్రపంచ ప్రసిద్దిగాంచిన మధుర పెడ గురించి తెలుసా..
Mathura Peda
Follow us on

వర్తకం కోసం మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు మనదేశాన్ని సుమారు రెండు వందల ఏళ్లు పరిపాలించారు. ఈ కాలంలో వారి స్వలాభం కోసం మన దేశంలో రైల్వేలు, పోస్టల్ వ్యవస్థ వంటి అనేక వ్యవస్తలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో భారతదేశం నుంచి బ్రిటిష్ వారు తమ దేశానికి అనేక వస్తువులను, సంపదను తరలించుకుని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే వస్తువు విలువైన కోహినూర్ వజ్రం గురించి కాదు. అది తినదగిన వస్తువు ‘మధుర పెడా’ అంటే పాలకోవ అన్నమాట. భారతదేశంలో ఒక పాలకోవా తయారీ దుకాణం ఉంది. ఇది 160 సంవత్సరాలకు పైగా నడుస్తోంది. ఇక్కడ తయారు చేసిన పాల కోవా ఒకప్పుడు బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన డైనింగ్ టేబుల్‌ మీద ఉండేది. ఈ పాలకోవ తయారీ దుకాణం బ్రజ్ ప్రాంతంలో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పాలకోవ తయారీ ఉత్తరప్రదేశ్‌లోని మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన మధురలోనే మొదలైంది. ఈ దుకాణంలో తయారు అయ్యే పాలకోవాను ఇష్టపడే వారి సంఖ్య తక్కువ కాదు. ద్వారక అంటే గుజరాత్ లోని ఒక దుకాణం నుండి పాలకోవ బ్రిటిష్ రాజకుటుంబం వద్దకు చేరుకుంది.

1860లో దుకాణం ప్రారంభమైంది

ఇవి కూడా చదవండి

గుజరాత్‌లోని వడోదరకు చెందిన ‘పెండవాలా దులిరామ్ రతన్‌లాల్ శర్మ’ అనే ప్రసిద్ధ పాలకోవ దుకాణం గురించి ఇప్పటి వరకూ మనం మాట్లాడుకుంటున్నాము. ఈ షాప్ 1860 సంవత్సరం ప్రారంభంలో రాజ్‌పురా రోడ్‌లో ప్రారంభమైంది. 1857 విప్లవం తర్వాత భారతదేశం బ్రిటిష్ రాజ్‌లో విలీనం అయిన కాలం ఇదే.

అనేక తరాల కృషి ఫలితం.

నిజానికి ఈ దుకాణానికి కృష్ణుడు జన్మ స్థలం మధురతో సంబంధం ఉంది. మిఠాయి వ్యాపారి దులిరామ్ జీ , మహారామ్ జీ అనే ఇద్దరు సోదరులు మొదట మధురలోనే ఈ పాలకోవ తయారీ దుకాణాన్ని ప్రారంభించారు. అయితే ఆ తర్వాత గుజరాత్‌కు షిఫ్ట్ అయ్యారు. అనేక తరాల తర్వాత కూడా ఇప్పటికీ ఈ కుటుంబానికి చెందిన జతిన్ శర్మ , హిమాన్షు శర్మ ఈ బ్రాండ్ ను, గుర్తింపును కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీరి పాలకోవ నగరంలోని అనేక ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. నేటికీ ఈ షాప్ లో తయారు అయ్యే పాలకోవ ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు కూడా వారి దుకాణంలో తయారు అయ్యే పాలకోవ రుచి ఏ మాత్రం మారలేదు.

క్వీన్ విక్టోరియా ప్లేట్‌లో ఎలా చేరింది?

ఈ దుకాణంలో తయారైన కోవా అసలు బ్రిటన్ రాణి విక్టోరియా వద్దకు ఎలా చేరింది అనే విషయంపై ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. బ్రిటీష్ రాజకుటుంబానికి చేరుకోవడానికి ముందు, ఈ దుకాణంలోని పాలకోవాలు వడోదరలోని గైక్వాడ్ రాజ కుటుంబంలో చోటు సంపాదించాయి. ఒక రోజు మహారాజా ఖండేరావ్ గైక్వాడ్ II ఏనుగుపై కూర్చొని ఈ దుకాణం మీదుగా వెళ్తున్నారు. అప్పుడు ఆ ఏనుగు దుకాణం ముందు ఆగి నిలబడిపోయింది. అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందు వేయలేదు. ఆ షాప్ నుంచి పాలకోవాలు కొని తినిపించిన తర్వాత అక్కడ నుంచి కదిలింది.

ఈ సంఘటన తర్వాత ఈ దుకాణం కీర్తి చాలా వరకు వ్యాపించింది. తరువాత వడోదర మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III ఈ దుకాణం నుంచి క్వీన్ విక్టోరియా వద్దకు చేరుకున్నారు. ఆమె ఈ పాలకోవాలను రుచి చూశారు. ఆమె వాటిని ఎంతగానో ఇష్టపడ్డారు. ఆ తర్వాత బ్రిటీష్ రాజకుటుంబంలో జరిగే విందులలో పాలకోవ తరచుగా డెజర్ట్‌గా వడ్డించే సంప్రదాయం మొదలైంది.

 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..