Lifestyle: హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్నవాళ్లు వెంటనే ఈ పని చేయండి..

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తగితన హిమోగ్లోబిన్‌ ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో అన్ని జీవ క్రియలు సవ్యంగా సాగాలంటే హిమోగ్లోబిన్‌ ఉండాల్సిందే. హిమోగ్లోబిన్‌ లేకపోతే రక్తహీనత సమస్య వెంటాడుతుంది. దీంతో శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. మరి సహజంగా హిమోగ్లోబిన్‌ను...

Lifestyle: హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్నవాళ్లు వెంటనే ఈ పని చేయండి..
Foods for Hemoglobin

Updated on: Mar 18, 2024 | 10:20 PM

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తగితన హిమోగ్లోబిన్‌ ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరంలో అన్ని జీవ క్రియలు సవ్యంగా సాగాలంటే హిమోగ్లోబిన్‌ ఉండాల్సిందే. హిమోగ్లోబిన్‌ లేకపోతే రక్తహీనత సమస్య వెంటాడుతుంది. దీంతో శరీరంలో ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. మరి సహజంగా హిమోగ్లోబిన్‌ను పెంచుకోవాలంటే ఏం చేయాలి.? ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరుగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం..

* హిమోగ్లోబిన్‌ పెంచడంలో ఆపిల్స్‌ ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే విట‌మిన్ సి, ఐర‌న్‌లు.. శ‌రీరం ఐర‌న్ ను గ్ర‌హించే సామ‌ర్థ్యం పెంచుతాయి. దీంతో హిమోగ్లోబిన్‌ స్థాయి పెరుగుతుంది.

* హిమోగ్లోబిన్‌ సమస్యకు దానిమ్మ కూడా బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో ఐర‌న్, విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎర్ర ర‌క్త‌క‌ణాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

* ఇక హిమోగ్లోబిన్‌ లోపం ఉంటే అరటి పండ్లను కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాటిలోని అర‌టి ఐర‌న్ , విట‌మిన్ బి6 ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త ఆరోగ్యం బాగుపడుతుంది.

* శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచ‌డంలో జామపండ్లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో విట‌మిన్ సి, ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో జామ‌పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

* స్ట్రాబెర్రీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శ‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి.

* పుచ్చ‌కాయ‌ కూడా హిమోగ్లోబిన్‌ను పెంచడంలో ఉపయోగపడుతుంది. పుచ్చ‌కాయ‌లో నీరు, విట‌మిన్ సి, ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ పెరగడంలో ఉపయోగపడుతంది.

* శరీరం ఐరన్‌ను ఎక్కువగా గ్రహించడంలో విటమిన్‌ సి అధికంగా ఉండే కివి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో శ‌రీరంలో హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..