“తాగింది గోరంత.. మిషన్ చూపించేదీ కొండంత”.. లబోదిబోమంటున్న ఆటోవాలా..!

| Edited By: Balaraju Goud

Jul 03, 2024 | 4:51 PM

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులకు ప్రతిరోజూ వింత ఘటనలు ఎదురవుతుంటాయి. ఎలాంటి పేపర్లు లేకుండా బుకాయించే వాళ్లు కొందరైతే.. సిగ్నల్స్ జంప్ చేసి పట్టుబడే వాళ్లు మరి కొందరు. ఇదిలా ఉంటే, తాగి వాహనాలు నడిపి దొరికిపోయేవారు ఇంకో రకం. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తనిఖీలు నిర్వహించే సమయంలో అడ్డంగా దొరికిపోయాడు.

తాగింది గోరంత.. మిషన్ చూపించేదీ కొండంత.. లబోదిబోమంటున్న ఆటోవాలా..!
Drunken Autowala
Follow us on

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులకు ప్రతిరోజూ వింత ఘటనలు ఎదురవుతుంటాయి. ఎలాంటి పేపర్లు లేకుండా బుకాయించే వాళ్లు కొందరైతే.. సిగ్నల్స్ జంప్ చేసి పట్టుబడే వాళ్లు మరి కొందరు. ఇదిలా ఉంటే, తాగి వాహనాలు నడిపి దొరికిపోయేవారు ఇంకో రకం. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తనిఖీలు నిర్వహించే సమయంలో అడ్డంగా దొరికిపోయాడు. తప్పు కదా అని అడిగితే, విచిత్రమైన కారణాలు చెబుతూ బుకాయించాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

తనిఖీల్లో భాగంగా రోడ్డు మీద వెళ్తున్న ఆటోను ట్రాఫిక్ సిబ్బంది పట్టుకున్నారు. అందులో నుంచి ఒక వయసు పైబడిన ఆటో డ్రైవర్ దిగాడు. చూస్తే అప్పటికే ఫుల్లుగా మద్యం తాగేసి ఉన్నాడు. తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని, పేపర్లు చూపించాలని ట్రాఫిక్ పోలీసులు బెదిరించారు. ఇక అంతే ఏడుపు మొహం పెట్టేసి.. అలా తాగి, ఇలా బయటకు రావడమే ఆలస్యం పోలీసులు పట్టుకున్నారని బోరుమన్నాడు. తనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని, కాస్త దయ చూపించి వదిలేయాలని బ్రతిమిలాడుకున్నాడు. పోలీసులు ససేమిరా అంటున్నా వినకుండా భయపడిపోతూ ఇంకోసారి ఇలా చేయనని బుకాయించాడు. తాగింది గోరంత అయితే, మిషన్ చూపించేదీ కొండంత అంటూ తప్పు మీటర్‌ను తప్పుబట్టాడు.

రోజంతా కష్టపడితే తప్ప ప్యాసింజర్లు దొరకడం లేదని, అందుకే ఆ బాధలో ఉండి ఒక పెగ్గు తాగానని కంటితడ పెట్టుకున్నాడు. తానెప్పుడూ తాగలేదని, ఈ రోజే మొదటిసారి తాగానని, ఇలా తాగి బయటకి వచ్చానో లేదో పోలీసులు పట్టేసుకున్నారని మొర పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయ్యో పాపం ఆటో వాడు ఎంత బాధలో ఉన్నాడో అని కామెంట్లు చేస్తున్నారు. తాగి ఆటో నడిపి దొరకిపోవడమే కాకుండా.. అతను చెప్పే సమాధానాలు మరింత విచిత్రంగా ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కళ్లను తుడుచుకుంటూ ఆ వయసులో ఉన్న వ్యక్తి బతిమిలాడుతుంటే ఎవరికైనా అయ్యో పాపం అనిపించక మానదు కదా మరి..!
వీడియో…

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…