Watch Video: కిచెన్ నుంచి వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా.. కనిపించిన షాకింగ్ దృశ్యం..

ఓ మహిళ తన ఇంటి కిచెన్‌లో నుంచి వింత శబ్దాలు రావడాన్ని గమనించింది. ఏంటని వెళ్లి చూడగా.. మైక్రోవేవ్ ఓవెన్ చుట్టూప్రక్కల..

Watch Video: కిచెన్ నుంచి వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా.. కనిపించిన షాకింగ్ దృశ్యం..
Pythons Video
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 06, 2022 | 9:04 PM

ఓ మహిళ తన ఇంటి కిచెన్‌లో నుంచి వింత శబ్దాలు రావడాన్ని గమనించింది. ఏంటని వెళ్లి చూడగా.. మైక్రోవేవ్ ఓవెన్ చుట్టూప్రక్కల ఏదో కదులుతుండటం గుర్తించింది. భయంతో నెమ్మదిగా అటువైపు వెళ్లింది. అంతే అక్కడ కనిపించిన షాకింగ్ దృశ్యాన్ని చూసి దెబ్బకు కంగుతిన్నది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది ఇంతకీ అక్కడేం కనిపించింది.. ఏం చూసి ఆ మహిళ భయపడిందో తెలియాలంటే..

వివరాల్లోకి వెళ్తే.. క్వీన్స్‌లాండ్‌లోని బుదేరిమ్‌లో నివాసముంటున్న ఓ మహిళ ఇంట్లోని కిచెన్ నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఏంటని ఆమె భయం.. భయంగా వెళ్లి చూసింది. ఆ మహిళకు మైక్రోవేవ్ ఓవెన్ ప్రక్కన ఊహించని దృశ్యం కనిపించింది. దీంతో దెబ్బకు కంగుతిన్నది. ఓవెన్ వెనుక రెండు భారీ సైజ్ కొండచిలువలు ఉండటంతో.. వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించింది.

స్థానికంగా ఉన్న సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ రెండు కొండచిలువలను చాకచక్యంగా పట్టుకుని బంధించారు. అవి రెండు ఆడ, మగ కొండచిలువలు అని.. కలయికలో ఉన్నాయని స్నేక్ క్యాచర్స్ అన్నారు. కాగా, గతంలోనూ బుదేరిమ్‌ ప్రాంతంలో పలు పైథాన్‌లను పట్టుకున్నామని.. ఇక్కడ జనావాసాలకు అటవీ ప్రాంతం దగ్గరలో ఉండటంతో.. పాములు, కొండచిలువలు తరచూ ఇలా ప్రజల ఇళ్లల్లోకి అనుకోని అతిధిలుగా వస్తాయని చెప్పుకొచ్చారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!