మన దేశంలో ద్విచక్ర వాహనదారుల సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి చిన్న పనికి మనం టూవీలర్ ఉపయోగిస్తుంటాం. అయితే కొన్ని సార్లు విచిత్రమైన పరిస్థితి ఎదుక్కొవల్సి వస్తుంది. మనం వేగంగా ఏదో పనిపై వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా అరుస్తూ మన వెంట పడుతుంటాయి గ్రామసింహాలు. అందులో రాత్రిపూట బైక్‌లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు కుక్కలు బైక్‌ను వెంబడించడం మొదులు పెడుతాయి. మీరు ఎప్పుడో ఒకసారి అనుభవించి ఉండాలి. ఇలాంటి ఘటనలు మనలో చాలా మందికి జరిగి ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో బైక్‌ను మరింత వేగంగా నడిపి ప్రమాదాలకు గురైన సంఘటనలు చాలా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో కుక్కలు ఎందుకు మొరుగుతాయో మనకు అర్థం కాదు. ఎలా తప్పించుకోవాలో కూడా తెలియదు.
అయితే, కుక్కలు మొరగడానికి చాలా కారణాలు ఉండవచ్చు. అందుకే, ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు దూరంగా ఉండి.. ఈరోజు మనం చెప్పబోయే దాన్ని నివారించే మార్గం ఏంటో నేరుగా దృష్టి సారిద్దాం. నిజానికి, మీరు రాత్రిపూట బైక్ లేదా స్కూటర్‌పై కుక్కల మధ్యగా వెళుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీరు ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే అవి వెంబడించడాన్ని గమనించి ఉంటారు. కానీ, అలా వెంబడించకూడదని అనుకుంటే మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం