Animals In Dreams : నిద్రలో కలలు కనని వారు బహుఅరుదు.. కొంతమందికి అందమైన కలలు వస్తే.. కొంతమంది ఆరోజు తాము చూసిన సన్నివేశాలకు అనుగుణంగా కలలు కంటారు. ఇంకొంతమందికి రకరకాల జంతువులు కలలోకి వస్తాయి. అయితే ఇలా వివిధ జంతువులు కలలోకి రావడానికి ఒక కారణం ఉంటుందని చెబుతారు పెద్దలు. జంతువులు కలలో కనిపించే విధానంతో మీ జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తాయని కొంతమంది విశ్లేస్తున్నారు. కొంతమంది ఏ జంవువు కనిపిస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో.. తమకు రోజులో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి అని భయపడుతుంటారు. ఈరోజు ఏ జంతువు కలలోకి వస్తే.. ఎటువటిని ఫలితం ఎదురవుతుందో తెలుసుకుందాం..
*కుక్క కలలోకి వస్తే మీ ప్రత్యర్ధి పై మీరు విజయం సాధిస్తారని, అలాగే ఒక మంచి స్నేహితుడుని కొల్పొతున్నారని సూచన.
*కలలోకి తెల్ల పిల్లి కనుక వస్తే కష్టాలు రాబోతున్నాయని , నల్ల పిల్లి కనిపిస్తే మానసిక సామర్ధ్యాలు ఉపయోగించడానికి భయపడుతాన్నరని అర్ధం. అయితే కలలో మీరు పిల్లిని తరుముతున్నట్లు వస్తే మీరు అడ్డంకులను అధిగమిస్తారని సూచన.
* ఒంటె మీ కలలోకి వస్తే.. భారమైన సమస్యలను మీ భుజాలపై మోస్తున్నారని, మన్నించే గుణం ఎక్కువని అర్ధమట
*కలలోకి నల్లని గుర్రం వస్తే హింస మరియు క్షుద్రశక్తులుకు ,తెల్ల గుర్రం కనిపిస్తే అదృష్టానికి సూచనట
*మీ కలలోకి గాడిద కనిపిస్తే.. ప్రేమలో పరాజయం పొందుతారని .. చికాకులు ఉన్నాయని.. అర్ధమట
*మేక కనిపిస్తే మీరు సరిగ్గా పరిస్థితులను అంచనా వేయలేకపోతున్నారని, అవివేకపు పనులు చేస్తున్నారని అర్ధం.
* పంది కనిపిస్తే మీకు స్వార్ధం లేదా అత్యాశతో అలోచిస్తున్నారని అర్ధం.
* కలలోకి ఏనుగు వస్తే మీరు సహనం ఉన్నవారిని.. ఎదుటివారి పట్ల అవగాహాన వుండాలని సూచనట
* కలలో జింక కనిపిస్తే మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకోనున్నారని.. ఆర్ధిక సమస్యలు తీరతాయని ముందస్తు సూచన
*మీ కలలో ఆవు కనిపిస్తే మీ విధేయత తో మెలగాలని సూచిస్తుంది.
* ఎద్దు కలలోకి వస్తే అనుకోని సంపద రాబోతుందని.. అదే ఆబోతు వస్తే.. మీ కోరికలు నియంత్రణ లో లేవని అర్ధం.
*అదే ఎద్దు కలలోకి వచ్చి పొడిచినట్లు కనిపిస్తే వారం రోజుల్లో ఎవరితోనైనా గొడవ జరుగుతుందట
కలలోకి పాము కనిపిస్తే నిజజీవితంలో ఏదో పెద్ద ప్రమాదం ఎదుర్కొబొతున్నారని సూచన.
Also Read: Ayurveda: వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు..