Shocking: ‘మాస్క్’ కోసం రూ. 82 లక్షలు రిజెక్ట్ చేసిన అమ్మాయి.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు..!

|

Mar 20, 2023 | 8:05 AM

కరోనా మహమ్మారి మాస్క్‌ల విలువను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ చిన్న మాస్క్ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో చూపించింది. కరోనాకు మందు లేనప్పుడు.. ఈ మాస్కే మనల్ని అందరినీ సురక్షితంగా కాపాడింది.

Shocking: ‘మాస్క్’ కోసం రూ. 82 లక్షలు రిజెక్ట్ చేసిన అమ్మాయి.. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు..!
Follow us on

కరోనా మహమ్మారి మాస్క్‌ల విలువను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ చిన్న మాస్క్ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో చూపించింది. కరోనాకు మందు లేనప్పుడు.. ఈ మాస్కే మనల్ని అందరినీ సురక్షితంగా కాపాడింది. ఇప్పుడంటే కరోనా బూస్టర్ డోస్‌లు కూడా వచ్చాయి కానీ.. నాడు పరిస్థితులు అత్యంత దారుణంగానే ఉండేవి. అయితే ఇప్పటికీ మాస్క్‌లు ధరించే వారు చాలా మంది ఉన్నారు. మరి కొన్ని సెకన్ల పాటు మాస్క్‌ని తీయాల్సి వస్తే.. ఏం చేస్తారు. ఏముందిలే అని కాసేపు తీస్తారు. కానీ, ఓ అమ్మాయి మాత్రం ఏకంగా రూ. 82 లక్షలు రిజెక్ట్ చేసి మాస్క్ తీయనంటే తీయనని తెగేసి చెప్పింది.

వినడానికి వింతంగా ఉన్నా.. ఇది నిజంగా నిజం. అమెరికన్ పారిశ్రామికవేత్త, టెక్ దిగ్గజం స్టీవ్ కిర్చ్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తన సహ ప్రయాణికురాలు మాస్క్ ధరించి ఉండటాన్ని గమనించాడు. అయితే, ఆమెను ఒకసారి మాస్క్ తీయాల్సిందిగా కోరాడు స్టీవ్. అందుకే ఆమె నిరాకరించింది. దాంతో.. స్టీవ్ ఆమెకు భారీగా డబ్బు ఆఫర్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 82 లక్షలు ఆఫర్ చేశాడు. అవును, మాస్క్ తీస్తే రూ. 82 లక్షలు ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి మాస్క్ తీసేందుకు అంగీకరించలేదు. రూ. 82 లక్షలు రిజెక్ట్ చేసిందే తప్ప.. మాస్క్ మాత్రం తీయలేదు. దాంతో షాక్ అయ్యాడు స్టీవ్. తాను ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితికి సంబంధించిన వివరాలను స్టీవ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

‘‘నేను డెల్టా ఫ్లైట్‌లో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నాను. ఒక మహిళ నా పక్కన కూర్చుంది. ఆమె మాస్క్ ధరించింది. ఇంకా మాస్క్ అవసరం లేదని, తీసేయొచ్చని నేను ఆమెను కోరారు. ఆ మహిళ మాస్క్ తీసేందుకు నిరాకరించింది. ఆ తర్వాత నేను ఆమెను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాను. కానీ ఆమె అంగీకరించలేదు. ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టాను. కానీ ఆమె దృఢ నిర్ణయం ముందు నా ఆఫర్లన్నీ విఫలమయ్యాయి.’’ అని చెప్పుకొచ్చాడు.

స్టీవ్ మొదట ఆమెకు 100 డాలర్లతో ఆఫర్‌ను ప్రారంభించాడు. అయినప్పటికీ ఆమె మాస్క్ తీసేందుకు అంగీకరించలేదు. అలా అతను ఆఫర్ అమౌంట్‌ను పెంచుతూనే ఉన్నాడు. చివరికి 100,000 డాలర్ల ఆఫర్ (రూ. 82 లక్షలు) ఇచ్చాడు. కానీ ఆమె అంగీకరించలేదు. కానీ, చివరకు ఆహారం తినడానికి ఆమె తన మాస్క్ తీయాల్సి వచ్చింది. స్టీమ్ ఈ మొత్తం కథను ట్విట్టర్‌లో పంచుకున్నాడు. దీనిపై ప్రజలు తమ తమ స్పందనలను కామెంట్స్ రూపంలో పేర్కొంటున్నారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..