AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: స్నేహితులు గిఫ్ట్స్ ఇవ్వలేదని.. పెళ్లి ఆపేసిన యువతి.. అసలు విషయమేంటంటే.!

ప్రతి ఒక్కరూ తమ వివాహం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అంగరంగ వైభవంగా జరిగేందుకు...

Viral: స్నేహితులు గిఫ్ట్స్ ఇవ్వలేదని.. పెళ్లి ఆపేసిన యువతి.. అసలు విషయమేంటంటే.!
Bride 1 1
Ravi Kiran
|

Updated on: Apr 24, 2021 | 11:35 AM

Share

ప్రతి ఒక్కరూ తమ వివాహం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అంగరంగ వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. దీని కోసం ముందు నుంచే డబ్బును కూడబెట్టుకుంటారు. కొన్నిసార్లు పేద వాళ్లు తమ వివాహ ఖర్చులు చెల్లించేందుకు ఎన్జీవో లేదా సామాజిక కార్యకర్తల సహాయాన్ని తీసుకుంటారు. కాగా, గొప్పగా వివాహం చేసుకునేందుకు వరుడు సహాయమడగడం ఎప్పుడైనా చూశారా.? ఈ వింత కేసు తాజాగా బ్రిటన్ లో వెలుగు చూసింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రిటన్ కు చెందిన ఓ మహిళ తన పెళ్లి తంతు సమయంలో హాలీవుడ్ స్టార్ కిమ్ కర్దాషియాన్ లాగా కనిపించాలని కోరుకుంది. కానీ దాని కోసం ఆమెకు చాలా డబ్బు అవసరం అయింది. అందుకే స్నేహితుల సహాయం కోరుకుంది. అయితే ఆమె ఫ్రెండ్స్ వద్ద డబ్బు లేకపోవడంతో.. సదరు మహిళ వారిపై కోపం తెచ్చుకోవడమే కాకుండా.. పెళ్లిని అమాంతం రద్దు చేసుకుని.. తన బాయ్ ఫ్రెండ్ ను అర్ధాంతరంగా విడిచిపెట్టింది.

పెళ్లిని చిరస్మరణీయంగా మార్చడానికి 60 వేల డాలర్లు అవసరం…

బ్రిటన్ కు చెందిన సుజాన్ అనే మహిళకు వివాహాన్ని ఘనంగా చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అయితే ఆమె కల ఒక్కసారిగా ముక్కలైంది. పెళ్లి నిమిత్తం ఆమె స్నేహితులను డబ్బులు కోరగా.. అందరూ మోసం చేశారు. దీనితో ఆమె తన కాబోయే భర్తతో విడిపోవడమే కాకుండా పెళ్లిని కూడా రద్దు చేసింది.

నేను 14 ఏళ్ళ వయసులో ప్రేమలో పడ్డాను. 18 ఏళ్ళ వయసులో నిశ్చితార్థం. ఇలా ఇద్దరం ఘనంగా పెళ్లి చేసుకునేందుకు 15 వేల డాలర్లను జోడించాం. కానీ ఇంకా 60 వేల డాలర్లు అవసమయ్యాయి. నా లైఫ్ లోని ఆ మధుర క్షణాల కోసం ఎంతో కష్టపడ్డాను. అని చెబుతూ సుజాన్ ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొంది.

తన వివాహానికి వచ్చిన ప్రతీ ఒక్కరిని 1500 డాలర్లు తీసుకురావాలని కోరింది. అంతేకాకుండా ఆమె మాజీ ప్రియుడు కుటుంబం 2.5 లక్షలు.. సన్నిహితులు మూడున్నర లక్షలు ఇస్తామని సుజాన్ కు వాగ్దానం చేశారు. అంతా బాగానే ఉంది. కాని అప్పుడు నా స్నేహితులు నన్ను మోసం చేయడం ప్రారంభించారు. గో ఫండ్ అనే పేజీ ద్వారా విరాళాలకు ప్రయత్నించగా.. ప్రయోజనం లేకపోయింది. దీనితో సుజాన్ తన వివాహాన్ని రద్దు చేయడంతో పాటు ప్రియుడి నుంచి కూడా విడిపోయింది.

Follow Us