చాణక్య నీతి : లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆచార్య చాణక్య ఈ 3 మార్గాలను బోధిస్తున్నాడు..

|

Jul 16, 2021 | 8:08 AM

చాణక్య నీతి : ఆచార్య చాణక్య డబ్బు ఉపయోగాన్ని వివరిస్తూ అది నిజమైన స్నేహితుడని భావించారు. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని సూచించారు. కష్ట సమయాల్లో

చాణక్య నీతి : లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆచార్య చాణక్య ఈ 3 మార్గాలను బోధిస్తున్నాడు..
Acharya Chanakya
Follow us on

చాణక్య నీతి : ఆచార్య చాణక్య డబ్బు ఉపయోగాన్ని వివరిస్తూ అది నిజమైన స్నేహితుడని భావించారు. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని సూచించారు. కష్ట సమయాల్లో ఎవరూ మీకు సహాయం చేయనప్పుడు ఈ డబ్బు మిమ్మల్ని కాపాడుతుందని చెప్పారు. అందుకే అందరూ సంపదను గౌరవించి పొదుపు చేసుకోవాలన్నారు. అయితే లక్ష్మి దేవి దయ ఉన్నప్పుడు మాత్రమే మీ ఇంట్లో మీ ధనం నిలుస్తుందని అన్నారు. తన చాణక్య నీతిలో లక్ష్మీ దేవిని సంతోషంగా ఉంచడానికి ఆచార్య 3 ప్రత్యేక మార్గాలు బోధించారు.

1. మీరు లక్ష్మీ దేవిని సంతోషంగా ఉంచాలనుకుంటే ఇంట్లో శుభ్రత గురించి పూర్తిగా జాగ్రత్త వహించాలి. ఇది కాకుండా ఇంట్లో ఎప్పుడు శాంతియుత వాతావరణం ఉండాలి. శుభ్రత, శాంతి లేని కుటుంబంలో లక్ష్మిదేవి అడుగుపెట్టదు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ ఉన్న ఇంట్లో, భార్యాభర్తలు ప్రేమతో జీవిస్తారు. తల్లి లక్ష్మి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయన్నారు.

2. మాటల్లో మాధుర్యం లేనివారు, చెడు మాటలు మాట్లాడేవారి ఇంట లక్ష్మీదేవి నిలువదు. చెడ్డ మాటలు మాట్లాడే వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరులకు హాని కలిగిస్తారు అందుకే వారి ఇంట్లో డబ్బు నిలువదు. మీరు వ్యాపారవేత్త అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి మాటలు మాట్లాడటానికి రావాలి. లేకపోతే మీరు డబ్బును సద్వినియోగం చేసుకోలేరు. ఉద్యోగం చేసేవారైనా సరే మంచి మాటలతో ఇతరుల హృదయాలను గెలుచుకోవచ్చు. అందరితో సౌమ్యంగా ఉండవచ్చు. అలాంటి సమయంలో లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. దీంతో మీరు వేగంగా అభివృద్ధి చెందుతారు.

3. దానధర్మాలకు గ్రంథాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చారు. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక సూత్రం ఉంటుంది. అతను ఏది దానం చేస్తే తిరిగి అదే పొందుతాడు. అందుకే జీవితం మెరుగ్గా ఉండటానికి మధురమైన పదాలు, సహాయం, సౌమ్యత, స్నేహం, దాతృత్వం, ధర్మం మొదలైనవి పాటించాలి. దానధర్మాలు చేసే వ్యక్తిపై తల్లి లక్ష్మికి ప్రత్యేక దయ ఉంటుంది. మరోవైపు సంపద ఉన్నప్పటికీ సాంఘిక సంక్షేమ పనులలో పాల్గొనని ధనవంతులను చూస్తే తల్లి లక్ష్మికి కోపం వస్తుంది. వారి సంపద ఖచ్చితంగా ఒక రోజు వృధా అవుతుంది.

Katrina Kaif Birthday : 38వ పడిలోకి కత్రినాకైఫ్.. సల్మాన్ నుంచి అక్షయ్ వరకు అదరహో.. ఇప్పుడు విక్కీ కౌషల్‌తో..

Dragon Fruit Benefits: డ్రాగన్‌ ఫ్రూట్‌ గురించి మీకు తెలుసా..? ప్రయోజనాలు ఏంటో తెలిస్తే వదిలిపెట్టరు..!

Funny virul video: ఓ మహిళ నీటిలోకి దిగుతుండగా.. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే.. వీడియో చూసిన తర్వాత మీరు కూడా..