
నాగుపాము.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టి భయంతో చచ్చపోతాం. ఇక ప్రత్యక్షంగా చూస్తే.. పరుగులు పెడతాం. అలాంటి పాము పడగవిప్పి బుసలు కొడితే.. గుండె ఆగినంత పనైతది. అలాంటిది బుసలుకొడుతున్న నాగు పాముకు హారతులు పట్టి, ప్రత్యేక పూజలు చేశారు మహిళలు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో నాగుపాము ఒక గుడి లో పూజలు అందుకుంది. పందికొట్కూరు గ్రామంలో పాతాళ వినాయక ఆలయ ప్రాంగణంలోకి ఎక్కడి నుంచో ఒక నాగు వచ్చింది. నాగుపామును చూసిన స్థానికుల్లో భయం కంటే భక్తి భావాన్ని చాటింది. ఆలయంలోనే తిష్ట వేసిన నాగుపాముకు పూజలు, హారతులు ఇచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
పాతాళ వినాయక అనుబంధ ఆలయమైన నాగదేవతాలయంలోనే రాత్రి నుంచి నాగుపాము తిష్ట వేసింది. మంగళవారం రాత్రి పాతాళ వినాయక స్వామి కైకర్యాలు ముగించుకుని ఆలయానికి తాళం వేస్తున్న సమయంలో ఆలయంలోకి నాగుపాము వచ్చిందని అర్చకులు తెలిపారు. పూజారుల ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు తండోపతండాలుగా తరలివచ్చారు. సాక్షాత్తు నాగదేవత దర్శనమిచ్చిందని ప్రత్యేక పూజలు చేశారు స్థానికులు. నాగదేవత దర్శనం లభించిందంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్న భక్తులు హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు. గ్రామమంతా నాగుపాము సందడి నేలకొనగా, మహిళలు ఆలయానికి వచ్చి పుట్ట వద్ద పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…