Aadhaar Card: స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ సింపుల్ స్టెప్స్‌తో..

|

Mar 01, 2021 | 2:26 PM

Aadhaar Card Can Download In Mobile: ప్రస్తుతం ఏ చిన్న పని చేయాలన్నా ఆధార్ తప్పనిసరిగా మారింది. సిమ్ కార్డు నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వరకు.. బ్యాంక్ ఖాతా ఓపెన్ నుంచి లోన్ వరకు ప్రతీ దానికి..

Aadhaar Card: స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ సింపుల్ స్టెప్స్‌తో..
Follow us on

Aadhaar Card Can Download In Mobile: ప్రస్తుతం ఏ చిన్న పని చేయాలన్నా ఆధార్ తప్పనిసరిగా మారింది. సిమ్ కార్డు నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వరకు.. బ్యాంక్ ఖాతా ఓపెన్ నుంచి లోన్ వరకు ప్రతీ దానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరమవుతోంది. దీంతో ప్రతీ ఒక్కరూ ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డును తమ వెంట తీసుకెళుతున్నారు.
అయితే ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో ఆధార్ కార్డు తీసుకెళ్లడం మర్చిపోతారు. కానీ మీరు వెళ్లిన సదరు ప్రదేశంలో ఆధార్ కార్డు చూపించడం తప్పనిసరి ఉంటుంది. అప్పుడు చేసేది ఏమీ ఉండదు కదూ.. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికే యూఐడీఏఐ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లోనే ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీంతో మీరు ఎక్కడున్నా సరే.. మీ చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు క్షణాల్లో ఆధార్ కార్డును ఎంచక్కా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంతకీ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేగా మీ సందేహం. కింద పేర్కొన్న ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా ఈ పనిని పూర్తి చేసుయొచ్చు.
* స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీ మొబైల్ నెంబర్ యూఐడీఏఐలో రిజిస్టర్ అయ్యి ఉండాలి.

* ఇందుకోసం మొదట.. మీ ఫోన్‌లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

* మై ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ ఆధార్‌ను క్లిక్ చేయాలి.
* ఆధార్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
* అనంతరం క్యాప్చర్ కోడ్ వస్తుంది దానిని ఎంటర్ చేసిన వెంటనే ‘సెండ్ ఓటీపీ’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
* వెంటనే ఈ-ఆధార్ కాపీ మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.
* డౌన్‌లోడ్ చేసుకున్న ఈ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది.
* ఆధార్ కార్డు ఓపెన్ కావాలంటే.. మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్లతో కూడిన పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.

Also Read: Obscene dances: తెలంగాణలోనూ మొదలైన ‘అశ్లీల’ సంస్కృతి.. కట్టమైసమ్మ జాతరలో వికృత కార్యక్రమాలు..

Pranati Rai Prakash : తేరా ముస్కురానా అంటూ ఫ్యాన్స్‌ను మంత్ర ముగ్ధులను చేసిన బాలీవుడ్ బ్యూటీ ప్రణతి