Young lady agitation: న్యాయం చేయండంటూ ప్రేమికుని ఇంటి ముందు మౌనదీక్ష చేస్తున్న యువతి

తనను రెండు సంవత్సరాల నుండి ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని ఎన్నో భాసలు చేసి చెట్టు, పుట్ట.. తిప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని

Young lady agitation: న్యాయం చేయండంటూ ప్రేమికుని ఇంటి ముందు మౌనదీక్ష చేస్తున్న యువతి
Agitation

Updated on: Aug 23, 2021 | 1:28 PM

A young woman dharna: తనను రెండు సంవత్సరాల నుండి ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని ఎన్నో భాసలు చేసి చెట్టు, పుట్ట.. తిప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఒక యువతి నిరసన బాట పట్టింది. తనకు న్యాయం జరిగేంత వరకు విశ్రమించేది లేదని ప్రేమికుని ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది ఒక యువతి.

వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపట్నం గ్రామానికి చెందిన కొలుకుల సంధ్యారాణి, అదే గ్రామానికి చెందిన అల్లి అరుణ్ కుమార్ ఇరువురు రెండు సంవత్సరాల నుండి ప్రేమించుకున్నారు.అరుణ్ కుమార్ తనను మోసం చేసి గర్భవతిని కూడా చేసాడని.. ఇపుడు పెళ్లి చేసుకోనంటున్నాడని యువతి కన్నీటి పర్యంతమయింది. భోరున విలపిస్తూ మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేసింది.

ఈ రోజు ఉదయం ఆరుగంటల నుంచే ప్రేమికుని ఇంటి ముందు న్యాయం చేయండంటూ మౌన దీక్ష ప్రారంభించింది. అరుణ్ కుమార్‌తో వివాహం చేయని పక్షంలో చావే శరణ్యం అంటూ ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలియచేసింది సంధ్యారాణి. కాగా, సంధ్యారాణి, అరుణ్ ఇద్దరు మేజర్లే.

Kmm

Read also: ‘వారికో లెక్క. మాకో లెక్కా..!’ అంటూ అధికారులపై మండిపడుతున్న మండలి మాజీ పెద్దలు, పీక్స్‌కు చేరిన ప్రోటోకాల్ రగడ