Self-surrender: మాయదారి కరోనా ప్రజలను ఎంతలా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా యావత్ ప్రపంచమే స్తంభించిపోయింది. ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. అయితే, దీని వల్ల కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా.. మరికొందరికి కుటుంబంతో గడిపే అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని కొంతమంది బాగా ఎంజాయ్ చేశారు. అయితే, కొంతకాలం ఇంట్లో ఉంటే సరదాగా ఉంటుంది కానీ.. నెలల తరబడి ఇంట్లో ఉండటం అంటే ఎవరికైనా విసుగొస్తుంది. ఇంగ్లండ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇంట్లో ఉండి విసిగిపోయిన సదరు వ్యక్తి.. తనను జైల్లో వేయండంటూ నేరుగా పోలీసుల వద్దుకు వెళ్లి అభ్యర్థించాడు. వివరాల్లోకెళితే.. ఇంగ్లండ్ లోని బర్గెస్ హిల్ పోలీస్ స్టేషన్‌కు ఓ వ్యక్తి వచ్చాడు.
తనను అరెస్ట్ చేసి జైలుకు పంపాలని పోలీసులను అభ్యర్థించాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండలేకపోతున్నానని, నరకం కనిపిస్తుందన్నాడు. ఇంట్లో ఉండటం కంటే.. జైలులో ఉండటమే మంచిదని పోలీసు అధికారులను సదరు వ్యక్తి వేడుకున్నాడు. ఇంట్లో ఉండలేకపోతున్నానని, నిద్ర కూడా పట్టడం లేదని, ఇంట్లో ఉండటం కంటే జైలు జీవితమే ప్రశాంతంగా ఉంటుందని పోలీసులను అభ్యర్థించాడు. తనను అరెస్ట్ చేసి జైల్లో వేయాలని కోరాడు. ఈ ఘటన తాలూకు వివరాలను బర్గెస్ హిల్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఇదిలాఉంటే.. స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తంగా కారణంగా ఇంగ్లండ్ లోని పలు ప్రాంతాల్లో అక్కడి అధికారులు లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే.
Also read:
ఆ సమస్యతో బంగారు భవనాన్ని అమ్ముతున్న యజమాని.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..