Amazing: పేర్లతో మాయ చేయడమంటే ఇదేనేమో.. ఈ రెస్టారెంట్‌లో వారికి ప్రత్యేక డిస్కౌంట్లు కూడా..

|

Dec 26, 2022 | 9:30 AM

ఏదైనా టూర్‌కు వెళ్లినప్పుడు లేదా.. ఎక్కువ దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు.. ఆకలి వేసే సమయం అయిందంటే కాసింత ఫుడ్ లాగించాల్సిందే.. బయలకు వెళ్లినప్పుడు రోటిన్‌కు భిన్నంగా మంచి టేస్టీ ఫుడ్ తినాలని చాలామంది అనుకుంటారు. అయితే వారున్న ప్రాంతంలో..

Amazing: పేర్లతో మాయ చేయడమంటే ఇదేనేమో.. ఈ రెస్టారెంట్‌లో వారికి ప్రత్యేక డిస్కౌంట్లు కూడా..
Second Wife Restaurant
Follow us on

Amazing: ఏదైనా టూర్‌కు వెళ్లినప్పుడు లేదా.. ఎక్కువ దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు.. ఆకలి వేసే సమయం అయిందంటే కాసింత ఫుడ్ లాగించాల్సిందే.. బయలకు వెళ్లినప్పుడు రోటిన్‌కు భిన్నంగా మంచి టేస్టీ ఫుడ్ తినాలని చాలామంది అనుకుంటారు. అయితే వారున్న ప్రాంతంలో ఎక్కడ ఫుడ్ బాగుంటుందో తెలుసుకోవడం చాలా కష్టం.. అలాంటి సమయాల్లోనే ఎక్కువ మంది రెస్టారెంట్‌ పేర్లకు ఆకర్షితులవుతారు. పేరు బాగుంటే ఫుడ్ బాగుంటుందిలే అనే అంచనాలో చాలా మంది ఉంటారు. అంచనాలకు తగినట్లు ఒకోసారి బాగుండచ్చు.. కొన్ని సార్లు బాగోకపోవచ్చు. ఏది ఏమైనా రెస్టారెంట్లు, హోటళ్లకు పేర్లు చాలా ఇంపార్టెంట్.. ఫుడ్ క్వాలిటీ ఒక ఎత్తైతే.. నేమ్ కూడా మరో ఎత్తు. అందుకే చాలా వెరైటీ పేర్లు కూడా కనిపిస్తుంటాయి. ఆ పేర్లకు ఆకర్షితులై అసలు రుచి చూద్దామని వెళ్లే వాళ్లు చాలా మంది ఉంటారు. కొంతమందికి కొన్ని పేర్లు నచ్చకపోవచ్చు కూడా.. ఇలా మనుషులకు పేర్లు పెట్టేటప్పుడు ఎంత కసరత్తు చేస్తారో.. తాము ప్రారంభించే వ్యాపారాలు లేదా ఇతర ఏదైనా సంస్థలకు పేర్లు పెట్టడానికి కూడా అంతే ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు కొంతమంది. దీనిలో భాగంగా చాలామంది రెస్టారెంట్లకు సెకండ్ వైఫ్ అని పేర్లు పెడుతున్నారు.

వాస్తవానికి చాలా మంది మొదట ప్రేమించేది తమ కుటుంబాన్ని అయితే తరువాత ఎక్కువ ప్రేమించేది ఇష్టమైన ఫుడ్‌నే.. అందుకే దీనికి సెట్‌ అయ్యేలా.. మీ సెకండ్ వైఫ్.. అంతే టేస్టీగా ఇక్కడ ఫుడ్ ఉంటుందనే సంకేతం ఇవ్వడానికి ఈ పేరును చాలా మంది ఎంచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే సెకండ్ వైఫ్ పేరుతో రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి తన హోటల్‌కు సెకండ్ వైఫ్ అనే పేరు పెట్టడమే కాకుండా.. రెండో పెళ్లి చేసుకున్నవారికి ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తుండటంతో ఈ పేరు ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

బీహార్‌కు చెందిన రంజిత్‌ కుమార్‌ తన హోటల్‌కు పేరు పెట్టే విషయంలో కాస్తంత వినూత్నంగా ఆలోచించాడు. కొత్తగా పెట్టిన తన హోటల్‌కు మై సెకండ్‌ వైఫ్‌ రెస్టారెంట్‌ అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగా.. రెండో వివాహం చేసుకున్నవారు ఈ హోటల్‌కు వస్తే రాయితీ కూడా ఇస్తున్నాడు. అసలు రంజిత్ కుమార్ తన హోటల్‌కు ఈ పేరు పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు. రాజధాని పాట్నాకు డభ్భై కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్‌ పట్టణంలో ఈ హోటల్‌ నెలకొల్పాడు రంజిత్‌. రోడ్డుపై వెళుతున్నవారు పేరు చూసి హోటల్‌కు వస్తున్నారు. ప్రస్తుతం హోటల్‌లో టీ, బర్గర్లు, నూడుల్స్‌ వంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపాడు. వేసవి కాలంలో ఐస్‌క్రీమ్‌లు సైతం విక్రయిస్తానని చెబుతున్నాడు. తాను సాధారణంగా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని, అందుకే ఈ హోటల్‌ తన రెండో భార్య వంటిదని రంజిత్‌ చెప్పాడు. హోటల్‌కు ఇలాంటి పేరు పెట్టడంపై తన కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారని వెల్లడించాడు. అయినాసరే తన రెస్టారెంట్‌కు ఈ పేరును ఎంచుకున్నట్లు చెబుతున్నాడు రంజిత్.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం చూడండి..