Telangana: భాష, సాంప్రదాయంపై మక్కువతో పెళ్లి కొడుకు ఏం చేశాడో తెలుసా?

తల్లిదండ్రులు కోయ భాషలో మాట్లాడేవారు. ఇల్లందు ప్రాంతంలో నివాసం ఉండడంతో తెలుగు భాషలోనే మాట్లాడుకునేవారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లికి చెందిన చింతా వినీతతో పెళ్లి నిశ్చయమైంది. ఈ సందర్భంగా వచ్చే నెల రెండోవ తేదీన వివాహ ముహుర్తాం ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే మాతృ భాషలో వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేయించాడు వరుడు.

Telangana: భాష, సాంప్రదాయంపై మక్కువతో పెళ్లి కొడుకు ఏం చేశాడో తెలుసా?
Wedding Card In Kaya Language

Updated on: Feb 27, 2025 | 3:33 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన ఉండం శ్రీనివాస్ పెళ్లి సందర్భంగా తన పెళ్లి కార్డును కోయ భాషలో ముద్రించాడు. ఉండం శ్రీనివాస్ మంచిర్యాలలో సింగరేణి ఎంప్లాయి‌గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు భద్రాచలానికి చెందినవారుగా ఉండగా సింగరేణి జాబ్ రావడంతో ఇల్లందుకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు చనిపోవడంతో డిపెండెంట్ ఉద్యోగం కింద సింగరేణి జాబ్ చేస్తున్నాడు ఉండం శ్రీనివాస్.

తల్లిదండ్రులు కోయ భాషలో మాట్లాడేవారు. ఇల్లందు ప్రాంతంలో నివాసం ఉండడంతో తెలుగు భాషలోనే మాట్లాడుకునేవారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లికి చెందిన చింతా వినీతతో పెళ్లి నిశ్చయమైంది. ఈ సందర్భంగా వచ్చే నెల రెండోవ తేదీన వివాహ ముహుర్తాం ఫిక్స్ చేశారు. అయితే వారి భాషపై మమకారంతో మరి పెళ్లి కార్డులపై కోయ భాషతో ముద్రించాలనుకున్నాడు. ఈ తరంలో తమ భాష కనుమరుగా కాకుండా ఈ తరం పిల్లలు కూడా తెలుసుకునే విధంగా తమ భాషలో వెడ్డింగ్ కార్డు ముద్రించాడు.

అందరికీ తెలిసే విధంగా ఉండాలని పెళ్లి కార్డు తమ భాషతో ముద్రించుకోవడం జరిగిందని తెలిపాడు ఉండడం శ్రీనివాస్. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు యువకుడి మాతృభాష అభిమానాన్ని అభినందిస్తూ కామెంట్ పెడుతున్నారు. అంతరించిపోయే జాబితాలో ఉన్న కోయ భాషను శుభలేఖ ద్వారా అందరికీ తెలియజేసే ప్రయత్నం చూసినందుకు శ్రీనివాస్‌ను అందరు ప్రశంసిస్తున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..