Fish Stuck in Man Throat: చేపలు పట్టబోయి చివరకు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. గాలానికి చెక్కిన చేపను తీసేందుకు చేతిలో ఉన్న చేపను నోట కరచుకోగా.. అదికాస్తా నోట్లోకి దూరడంతో గొంతులో ఇరుక్కుపోయింది. దాంతో అతను కొన్ని గంటల పాటు విలవిల్లాడాడు. చివరకు వైద్యుల కృషితో ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని కొలంబియాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొలంబియాకు చెందిన యువకుడు పివిజయ్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓ సరస్సు వద్దకు చేపల వేటకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న గాలంతో చేపల వేట సాగించాడు. కొద్దిసేపట్లోనే గాలానికి చేప చిక్కింది. దాంతో ఆ చేపను తీసుకుని చేతిలో పట్టుకున్నాడు. అలా మళ్లీ గాలం వేయగా.. మరో చేప చిక్కింది. అయితే ఒక చేతిలో అప్పటికే చేప ఉండటంతో గాలానికి చిక్కిన చేపను ఒంటిచేత్తో తీయడానికి రాలేదు.
దాంతో ఆ యువకుడు తన ఎడమ చేతిలో ఉన్న చేపను నోటితో పట్టుకున్నాడు. ఆ చేప పెనుగులాడటంతో అదికాస్తా ప్రమాదవశాత్తు యువకుడి గొంతులోకి జారిపోయింది. దాంతో నోట మాట బంద్ అయిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో అతను చేపను బయటకు తీసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. ఎంతకీ రాకపోవడంతో విలవిల్లాడిపోయాడు. చేసేదేమీ లేక ఆస్పత్రికి పరుగులు తీశాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు.. గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీశారు. దాంతో అతను సేఫ్ అయ్యాడు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే, యువకుడి గొంతులో ఇరుక్కున్న చేపను వైద్యులు బటకు తీస్తున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. దాంతో ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Also read:
Kaloji University: యూజీ ఆయుష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కౌన్సిలింగ్.. ఏ తేదీల్లో అంటే..