RED Movie Trailer : ఎంజాయ్‌మెంట్-ఎంజాయ్‌మెంటే.. సేఫ్టీ-సేఫ్టీనే.. రెడ్ ట్రైలర్ లాంచ్‌లో హీరో రామ్
యంగ్ హీరో రామ్ నటించిన రెడ్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూరి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సాలిడ్ హిట్

యంగ్ హీరో రామ్ నటించిన ‘రెడ్’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న రామ్ ఇప్పుడు ‘రెడ్’ సినిమా అలరించడానికి రెడీ అయ్యాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించే ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘చాలా రోజుల తరువాత థియేటర్ లోకి రావడం చాలా కొత్తగా అనిపించింది. సినిమా ట్రైలర్ చూశాక చాలా కొత్తగా అనిపించింది. నేను ఇది వరకే రెండు మూడుసార్లు చూశాను. కానీ బిగ్ స్క్రీన్ పై ఇక్కడ చూడగానే సమ్ థింగ్ స్పెషల్ అనిపించింది.’ అన్నారు. ‘ఇంట్లో పూజ గది ఉన్నా గుడికే వెళతాం, ఫోన్ లో స్విగ్గీ ఉన్నారెస్టారెంట్ కే వెళతాం, ఇంట్లో బాటిల్ ఉన్న బార్ కే వెళ్తాము.. అలాగే ఎన్ని ఓ.టి.టి వేదికలున్నా థియేటర్లకే వచ్చి సినిమాలు చూస్తాం, ఆ అనుభూతే పూర్తిగా వేరుగా ఉంటుందని అన్నాడు రామ్. కరోనా కారణంగా సినిమా లేట్ అయ్యింది. అదే విధంగా జాగ్రత్తగాఉండండి .. ఎంజాయ్‌మెంట్-ఎంజాయ్‌మెంటే.. సేఫ్టీ-సేఫ్టీనే.. అని అన్నాడు రామ్ . ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.