Breaking: నైజీరియాలో మరో కొత్తరకం కరోనా..ప్రపంచ దేశాలు అలెర్ట్.. తస్మాత్ జాగ్రత్త.!
New Coronavirus Variant: అప్పుడు చైనా.. ఇప్పుడు బ్రిటన్, దక్షిణాఫ్రికా.. కరోనా వైరస్ స్ట్రెయిన్‌గా రూపాంతరం చెంది ప్రపంచదేశాల్లో..

New Coronavirus Variant: అప్పుడు చైనా.. ఇప్పుడు బ్రిటన్, దక్షిణాఫ్రికా.. కరోనా వైరస్ స్ట్రెయిన్‌గా రూపాంతరం చెంది ప్రపంచదేశాల్లో మరోసారి అలజడి సృష్టిస్తోంది. ఈ వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండటంతో.. ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఇండియాతో పాటు పలు దేశాలు యూకే నుంచే వచ్చే విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా నైజీరియా దేశంలో మరో కొత్తరకం కరోనాను అక్కడి ఆరోగ్య అధికారులు గుర్తించారు.
ఈ ఏడాది ఆగష్టు 3, అక్టోబర్ 9వ తేదీల్లో నైజీరియాలోని ఓసున్ రాష్ట్రంలో ఇద్దరు కోవిడ్ రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో.. కొత్తగా వైరస్ జన్యుమార్పిడిని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.
”బ్రిటన్‌లో కనిపించిన స్ట్రెయిన్‌కు.. ఇక్కడి వేరియంట్‌కు సంబంధం లేదు. నైజీరియాలో వైరస్ వ్యాప్తి చెందడానికి P681H వేరియంట్ దోహదపడుతుందని సూచించడానికి ఆధారాలు లేవు. అయినా దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి అవసరం ఉందన్నారు. అయితే ప్రజలు మాత్రం పూర్తి అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read:
యాంటీ బయోటిక్స్ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట
‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!
ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..
బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్
