Health Benefits: ఈ చెట్టు ఆకులు.. సర్వరోగ నివారిణి.. ఇలా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

|

Dec 09, 2022 | 4:22 AM

ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపు తులసి మొక్క లేదా తులసి చెట్టు ఉంటుంది. కొంతమంది కుండీల్లో పెట్టుకుంటే.. మరికొంతమంది నేలపైనే పాతుతారు. కొందరైతే ఉదయం లేవగానే స్నానం చేసుకుని తులసి మొక్కకు పూజలు కూడా చేస్తారు. ఈ తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి....

Health Benefits: ఈ చెట్టు ఆకులు.. సర్వరోగ నివారిణి.. ఇలా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Tulasi Benefits
Follow us on

ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపు తులసి మొక్క లేదా తులసి చెట్టు ఉంటుంది. కొంతమంది కుండీల్లో పెట్టుకుంటే.. మరికొంతమంది నేలపైనే పాతుతారు. కొందరైతే ఉదయం లేవగానే స్నానం చేసుకుని తులసి మొక్కకు పూజలు కూడా చేస్తారు. ఈ తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి.. దీనిని ఎలా ఉపయోగించాలో చాలామందికి తెలీదు. నిజంగా తులసి ఒక దివ్య ఔషదం. అనేక రోగాలకు నివారిణి కూడా. దాదాపు అందరి ఇళ్లలో ఈ దివ్యౌషధం ఉంటుంది. తులసి  చెట్టును భక్తితో పూజస్తారు. ముఖ్యంగా తులసి ఆకులు అన్ని రకాల రోగ కారకాలకు వ్యతిరేకంగా పని చేస్తాయి. తులసిలో ఉండే ఫ్లావనాయిడ్‌లు, యాంటీ వైరల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తులసిలో ఐరన్, విటమిన్-ఎ, విటమిన్ ‘సి’, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోజు తులసి ఆకులను వాడటం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఎండబెట్టిన తులసి ఆకులను పొడిగా చేసి, దీనికి ఒక చెంచా ఆవాలు నూనె కలిపిన మిశ్రమాన్నినొప్పిగా ఉన్న దంతాల కు పూసి, రాత్రంతా అలానే ఉంచితే.. మరుసటి నొప్పి తగ్గిపోతుంది. ఉడికించిన తులసి ఆకులను ఒక కప్పులో తీసుకొని, వీటికి తేనెను కలపి.. రాత్రి పడుకునే ముందుగా ఈ మిశ్రమాన్ని తాగొచ్చు. ఇది గురకను తగ్గిస్తుంది.

భోజనం తరువాత కొన్ని తులసి ఆకులను నమలడం వల్ల జీర్ణప్రక్రియ బాగా జరుగుతుందట. తులసి టీని తాగటం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చట. మీరు తులసిని యాంటీ- డిప్రెషన్ ముందుగా కూడా కూడా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రోజు రెండు సార్లు, 10 నుంచి 12 తులసి ఆకులను నమలటం వల్ల మెదడుకు కావలసిన ఆక్సిజన్ సరఫరాను సజావుగా జరుగుతుందట. ఎండలో ఎండబెట్టిన తులసి ఆకులను తీసుకొని రాత్రి నీటిలో నానబెట్టిన తింటే రక్తంలో చక్కెర స్థాయి అదువులో ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన వచ్చేవారు ఎండలో ఎండబెట్టిన తులసి ఆకులకు, ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలపండి. దీని మౌత్ వాష్ లాగా వాడండితే మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..