
ఈ విషయాన్ని ప్రముఖ కార్డియాలజిస్ట్ (గుండె వైద్య నిపుణుడు), 40 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్ అలోక్ చోప్రా నొక్కి చెప్పారు. మన భారతీయ వంటగదిలో సులభంగా దొరికే నాలుగు పదార్థాలు ఎటువంటి సప్లిమెంట్ల కన్నా మెరుగ్గా పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఇవి మన రోగనిరోధక శక్తిని, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయని, దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
A2 ఆవు నెయ్యి: డాక్టర్ చోప్రా దీనిని ప్రపంచానికి భారతదేశం అందించిన బహుమతి అన్నారు. A2 బీటా-కేసిన్ ప్రోటీన్ ఉత్పత్తి చేసే ఆవు పాల నుండి ఈ నెయ్యి తయారవుతుంది. దీనిని ఆయన ‘శరీరానికి, మెదడుకు స్వచ్ఛమైన ఇంధనం’ అని అభివర్ణించారు.
పొడి పండ్లు : ఈ పదార్థాలు ఆరోగ్యకరమైన కొవ్వుతో నిండి ఉంటాయి. కణాలను రిపేర్ చేయటానికి, మెదడు పనితీరును మెరుగుపరచటానికి ఇవి చాలా ఉపయోగపడతాయని డాక్టరు తెలిపారు.
మూలికలు, సుగంధ ద్రవ్యాలు: మన పూర్వీకులు ఆహారాన్ని రుచితో పాటూ, తెలివితేటలతోనూ రుచి చూసేవారని డాక్టర్ చోప్రా అన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, సుగంధ ద్రవ్యాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు, కొవ్వు కారణంగా కలిగే కణజాల నష్టాన్ని, మంటను ఇవి నిరోధిస్తాయి.
పప్పుధాన్యాలు : ఇవి అద్భుతమైన శాకాహార ప్రోటీన్ ఎంపికలు. ఇవి రోజువారీ శక్తిని పెంచడానికి, కండరాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వటానికి సహాయపడతాయని ఈ కార్డియాలజిస్ట్ వివరించారు.
చివరి మాట: నిజమైన ఆరోగ్యం ఎప్పుడూ సప్లిమెంట్ల రూపంలోనే రాదు, కొన్నిసార్లు అది మీ పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుందని డాక్టర్ చోప్రా ముగించారు.
గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం, సోషల్ మీడియాలో నిపుణులు అందించిన అభిప్రాయాల ఆధారంగా రాయబడింది. ఇది వైద్యపరమైన సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యలపై ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని సంప్రదించండి.