Fried Food: స్మోకింగ్‌తో వచ్చే రోగాలకంటే.. డీప్ ఫ్రై చేసిన ఫుడ్ తింటే వచ్చే వ్యాధులే ఎక్కువ

|

Jul 29, 2021 | 11:59 AM

Fried Food: కరోనా వచ్చిన తర్వాత ఎక్కువమందిలో తినే ఆహారం విషయంలో అవగాహన పెరిగింది. పోషకాలున్న ఆహారం తినడం వలన కలిగే లాభాలను గుర్తిస్తున్నారు. సమతుల్య ఆహారం..

Fried Food: స్మోకింగ్‌తో వచ్చే రోగాలకంటే.. డీప్ ఫ్రై చేసిన ఫుడ్ తింటే వచ్చే వ్యాధులే ఎక్కువ
Fried Food
Follow us on

Fried Food: కరోనా వచ్చిన తర్వాత ఎక్కువమందిలో తినే ఆహారం విషయంలో అవగాహన పెరిగింది. పోషకాలున్న ఆహారం తినడం వలన కలిగే లాభాలను గుర్తిస్తున్నారు. సమతుల్య ఆహారం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని స్పష్టంగా అందరికీ అర్ధమైంది. ఆరోగ్యకరమైన ఆహారంతో మన జీవనశైలిలో మార్పులు వస్తాయనే విషయాన్ని గుర్తించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని పదార్థాలు శరీరంలోని రోగనిరోధకశక్తిని బలహీనపరుస్తాయని, వీటిపై అవగాహన పెంచుకుంటే మంచి ఆరోగ్యం సొంతమవుతుందని చెబుతున్నారు.

ఎందుకంటే మనం తీసుకునే ఆహారం తేలికగా ఉన్నప్పుడు జీర్ణమయ్యే విషయంలో ఎటువంటి సమస్యా ఉండదు. అందుకనే తినే ఆహారంలో ఈజీగా ఉండే ఆహారం డైట్ గా చేర్చుకోవాలి. ఒకవేళ మీరు జీర్ణక్రియ సమస్యతో బాధపడుతుంటే.. తీసుకునే ఆహారం విషయంలో చాలా శ్రద్ధ అవసరం. ఏ ఆహారం తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అన్న దానిపై అవగాహన ఉండాలి. అయితే చాలామంది వేయించిన చిప్స్ ను తినడానికి ఇష్టపడతారు.. అలాంటి చిప్స్ తినడంకంటే సిగరెట్ తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు ఇన్‌స్టాగ్రామ్ ప్రసిద్ధ హెల్త్ హ్యాకర్ లూయిస్ హోవెస్‌.

సిగరెట్ ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. సిగరెట్ తాగే వారి ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపిస్తుంది. ధూమపానం వలన ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులు ఎదురవుతాయి.. అయినప్పటికీ చిప్స్ వంటి డీప్ ఫ్రై పదార్ధాలను ఆహారంగా తీసుకునే కంటే సిగరెట్ తాగడం మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా డయేరియా సమస్య వస్తుంది. అంతేకాదు కడుపు ఉబ్బరం, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి వేపుళ్లను ఎంత తక్కువగా తీసుకుంటే మీ జీర్ణక్రియ అంత సజావుగా సాగుతుంది.వేపుళ్లు మహా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రోటీన్లు, కొవ్వులతో వేయించిన పదార్థాల్లో ఉండే చక్కెరలు రసాయన చర్య జరిపి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. పదార్థాలను అతిగా వేయించకూడదని, ఇవి శరీర కణజాలాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని చెబుతున్నారు. కనుక డీప్ ఫై చేసే ఆహారపదార్ధాలకు ఎంత దూరంగా ఉంటె అంత మంచిదని అంటున్నారు.

Also Read:  బాక్సింగ్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన సతీష్‌ కుమార్‌. ఒలంపిక్స్‌లో మరో పతాకంపై ఆశలు రేపుతున్న ఆర్మీ ఆఫీసర్