
ఇటీవల కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు మనిషి జీవితంలో పెనుముప్పుగా మారాయి. అలాంటి ప్రమాదకర వ్యాధుల్లో తలసేమియా ఒకటి.. ఈ తలసేమియా వ్యాధి గురించి వినే ఉంటారు. ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే వారసత్వ రక్త రుగ్మత. శిశువు శరీరంలో ఎర్ర రక్తకణాలు సరిగా ఉత్పత్తి కాకపోవడం ఈ వ్యాధి లక్షణం. ఈ సమయంలో కణాల జీవితకాలం కూడా బాగా తగ్గిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి 21 రోజుల తర్వాత కనీసం ఒక యూనిట్ రక్తం అవసరం. ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. \
అయితే.. ఈ వ్యాధి, దాని చికిత్స గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధి లక్షణాలు.. చికిత్స గురించి తెలుసుకోండి..
రక్తహీనత స్క్రీనింగ్ తలసేమియా వ్యాధిని గుర్తిస్తుంది. అలాగే ఈ వ్యాధి చికిత్స పరిస్థితి రకం.. తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. తలసేమియా పిల్లలు తమ జీవితాంతం ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి రక్తమార్పిడులు చేసుకుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, జీన్ థెరపీ, జింటెగ్లో థెరపీ వంటివి అందిస్తారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..