ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. ప్రమాదకరమైన జబ్బుల గురించి అవగాహనతో ఉండటం మంచిది. దీంతో ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడొచ్చు. కొన్ని లక్షణాలను పసిగట్టడం ద్వారా.. ప్రారంభ సమయంలోనే వ్యాధులను గుర్తించి.. సరైన చికిత్స తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర వ్యాధుల్లో స్ట్రోక్ ఒకటి.. పక్షవాతం లక్షణాలను గుర్తించి త్వరగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పక్షవాతం అత్యవసర పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చు. మెదడుకు రక్తం సరఫరా సరిగా జరగనప్పుడు స్ట్రోక్ వస్తుంది. లేదా రక్త సరఫరాలో అంతరాయం కలిగినా స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల మెదడు కణాలు చనిపోతాయి. రోగికి అత్యవసర చికిత్స అందించకపోతే అతని ప్రాణానికే ప్రమాదం. పురుషులు, స్త్రీలలో స్ట్రోక్ కు సంబంధించి కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలను గుర్తించడం ద్వారా స్ట్రోక్‌ను చాలా వరకు ఎదుర్కోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
రోగి అకస్మాత్తుగా బలహీనత గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభించడం.. ముఖం ఒక వైపు, ఒక కాలు లేదా చేతికి తిమ్మిరి ఎక్కువగా ఉంటే ఈ సూచనలు ప్రమాదకరమైనవి. చేతులు, కళ్ళలో చలనం లేకపోవడం, ఎదుటివారు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోకపోవడం కూడా స్ట్రోక్ లక్షణాలు. ఈ లక్షణాలు కాలక్రమేణా మరింత తీవ్రమవుతాయి. ఒక రోగి అకస్మాత్తుగా అస్పష్టమైన (చూపు సరిగా కనిపించకపోవడం) దృష్టి గురించి ఫిర్యాదు చేయడం ప్రారంభించినా దానిని విస్మరించకూడదు. దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.
చాలా మంది రోగులు ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోతారు.. లేదా నియంత్రణ కోల్పోతారు. ఇలాంటి వాటిని అస్సలు విస్మరించకూడదు. వికారం, వాంతులు, జ్వరంతో పాటు, ఇది గుండె సమస్య లక్షణం కావచ్చు. కొంతమంది రోగులకు ఎక్కిళ్ళు కూడా ఉండవచ్చు. మరికొందరికి ఆహారం మింగడానికి ఇబ్బంది ఉండవచ్చు. ఈ లక్షణాలన్నీ స్ట్రోక్‌తో సంబంధం కలిగి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు అనేక ఇతర వ్యాధులలో కూడా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నప్పటికీ.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తలనొప్పిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మీకు ఆకస్మిక తలనొప్పి వచ్చినా లేదా మరే ఇతర కారణం లేకుండా తీవ్రమైన తలనొప్పి వచ్చినా మీకు సమీపంలో ఉన్న వారి నుంచి సహాయం తీసుకోండి. చాలా మంది రోగులు తీవ్రమైన తలనొప్పి సమస్యను విస్మరిస్తారు. అది.. స్ట్రోక్ సమస్య కావొచ్చని హెచ్చరిస్తున్నారు. తరచూ తలనొప్పి వస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..