World Lung Cancer Day: లంగ్స్‌ను శుభ్రపరిచే 5 ఆయుర్వేద మూలికలు.. వీటితో ఆ సమస్యలన్నీ మాయం..!

|

Aug 01, 2022 | 6:59 PM

World Lung Cancer Day: ప్రపంచ లంగ్స్ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగష్టు 1న జరుపుకుంటారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం..

World Lung Cancer Day: లంగ్స్‌ను శుభ్రపరిచే 5 ఆయుర్వేద మూలికలు.. వీటితో ఆ సమస్యలన్నీ మాయం..!
Lungs Health
Follow us on

World Lung Cancer Day: ప్రపంచ లంగ్స్ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగష్టు 1న జరుపుకుంటారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం ఈ దినోత్సవాన్ని జరుపుకోవడంలోని ముఖ్య ఉద్దేశ్యం. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే అలవాట్లు, కారకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఊపిరితిత్తులు శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి, అవి అవిశ్రాంతంగా పని చేస్తాయి. ఊపిరితిత్తులు.. ప్రాణవాయులు అయిన ఆక్సీజన్‌ను రక్తం ద్వారా మన శరీరం అంతటా ప్రసరణ చేస్తుంది.

అయితే, పెరుగుతున్న కాలుష్యం, ధూళి, వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తులు బలహీనంగా మారుతున్నాయి. ఫలితంగా ఆస్తమా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వ్యాధులు వస్తాయి. ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఊపిరితిత్తులను దృఢంగా ఉంచుకోవడానికి ఆయుర్వేదంలో అనేక నివారణలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం, అనేక ఔషధ మొక్కలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుత ఫలితాలనిస్తుంది. వీటిలో కొన్ని ముఖ్యమైన ఔషధాల గురించి చరక్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ హెల్త్ అడ్వైజర్ డాక్టర్ మనీషా మిశ్రా గోస్వామి వివరించారు. మరి ఆ ఆయుర్వేద మూలికలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పిప్పలి..

ఇవి కూడా చదవండి

పిప్పలి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇది శ్వాసకోశ వ్యవస్థకు అమృతం వంటిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. పిప్పలిని ప్రతి రోజూ.. రోజుకు కొద్ది మొత్తంలో పరిమాణం పెంచుకుంటూ పాలతో కలిపి 15 రోజుల పాటు తీసుకోవాలి. ఆ తరువాత మరో 15 రోజుల పాటు పిప్పలి తీసుకునే పరిమాణాన్ని క్రమంగా తగ్గించుకుంటూ పాలతో కలిపి తీసుకోవాలి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి అనేక శ్వాసకోస సమస్యలు నయం అవుతాయి.

పొడి అల్లం..

డ్రై అల్లం అంటే ఎండు అల్లం కూడా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే మంటను తగ్గిస్తుంది. పొడి అల్లం ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. తద్వారా శ్వాసక్రియను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. అల్లం పొడి గొంతు సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

తానికాయ(బిభితాకి)..

ఆయుర్వేదంలో తానికాయ ప్రత్యేక స్థానం ఉంది. త్రిఫలలో తానికాయ కూడా కీలకమైనది. ఈ పండు పొడి దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు.. అన్నిరకాల శ్వాసకోస సమస్యలను తొలగిస్తుంది. గొంతు వాపును తగ్గించి, పెరిగిన కఫాన్ని తొలగిస్తుంది. శ్వాసకోస వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అతిమధురం(ములేతి)..

ఆయుర్వేదం ప్రకారం లైకోరైస్(అతిమధురం) లో ఉండే తీపి, శీతలీకరణ లక్షణాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. జలుబు, దగ్గు వంటి అనేక శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు అతిమధురంను ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఈ లికోరైస్ ఊపిరితిత్తులు, గొంతులో పేరుకుపోయిన మందపాటి శ్లేష్మాన్ని కరిగించి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. లైకోరైస్ గొంతు నొప్పి, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

తులసి..

ఆయుర్వేదం ప్రకారం తులసి చాలా శక్తివంతమైన ఔషధం. ఇది అనేక శ్వాసకోశ వ్యాధులను నయం చేస్తుంది. తులసి ఆకులలో యూజినాల్ ఉంటుంది. ఇది జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. తులసి ఆకులను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, అనేక ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను నివారిస్తుంది.

ఆయుర్వేద దగ్గు సిరప్..

ఆయుర్వేద నిపుణులు ఇచ్చే దగ్గు సిరప్ కూడా.. నిరంతర జలుబు, దగ్గు సమస్యను వదిలించుకోవడంలో సహాయపడుతంది. ఇది శ్వాసకోశ వ్యవస్థను బలపరుస్తుంది. ఈ సిరప్ దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

యోగా కూడా..

ఆయుర్వేద మందులే కాకుండా.. అనులోమ్-విలోమ్, భ్రమరి వంటి ప్రాణాయామం, కపాలభాతి వంటి చర్యలు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో పెరుగు తినకపోవడం, చల్లటి ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి.

గమనిక: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏదైనా ఔషధం లేదా చికిత్సకు ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏదైనా సమస్య వస్తే వైద్యుడిని సంప్రదించడం ద్వారా చికిత్స పొందాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..