పుచ్చకాయ.. ఇది అందరికి ఇష్టమే. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని కూడా చాలా మందికి తెలిసిందే. ఇది మన శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని పరుస్తుంది. ఎండాకాలంలో పుచ్చపండు తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రోహిణీకార్తె సమయంలో మన శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. శరీరంలో వాటర్ స్థాయి తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-బీ, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పోటాషియం, క్లోరిన్, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్, విటమిన్-ఏ, విటమిన్ -బీ6, విటమిన్-సి తదితరాలు పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)