Health Tips: హడావిడి జీవితం, ఎక్కువ పని చేయడం వల్ల శరీరంలోని అనేక భాగాలలో నొప్పి వస్తుంది. పురుషులతో పోలిస్తే, మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఏదైనా పని చేసిన తరువాత శరీరంలో వివిధ భాగాలలో నొప్పి వస్తుంటుంది. ప్రధానంగా ఆడవారిలో అరికాళ్లలో నిప్పి వస్తుందని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఎక్కువసేపు నిలబడటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. చాలా సార్లు, అధిక బరువు, ఎక్కువసేపు నిలబడటం వలన అరికాళ్ళలో భరించలేని నొప్పి అనిపిస్తుంది. దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. స్త్రీల అరికాళ్ళలో నొప్పికి కారణాలు, ఆ సమస్య నుంచి ఉపశమనం పొందే మార్గం తెలుసుకుందాం.
ప్లాంటర్ ఫాసిటిస్ కూడా స్త్రీల అరికాళ్ళలో నొప్పిని కలిగిస్తుంది. ఇది పాదాలకు సంబంధించిన సమస్య. దీనిని ఆర్థోపెడిక్ అని కూడా అంటారు. దీని కారణంగా, అరికాళ్ళ కణజాలంలో వాపు ఉంటుంది. అంతే కాకుండా ఎక్కువ సేపు నడవడం వల్ల అరికాళ్లలో నొప్పి ఎక్కువ అవుతుంది. అరికాళ్లకు గాయం కావడం, అరికాళ్లలో వాపు, పాదాలు విరగడం వంటి కారణాల వల్ల కూడా నొప్పి వస్తుంటుంది.
అరికాళ్లలో విపరీతమైన నొప్పి ఉంటే.. ఒక గాజు సీసా తీసుకుని వేడి నీటిలో నింపాలి. ఆ తరువాత ఈ సీసాతో పాదాల అరికాళ్ళను పూర్తిగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే నొప్పి తగ్గడమే కాకుండా టెన్షన్ తగ్గుతుంది. ప్లాస్టిక్ బాటిల్‌లో నీటిని నింపి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఐస్ మాదిరిగా గడ్డకట్టినప్పుడు.. దానిని ఒక గుడ్డలో చుట్టి, అరికాళ్ళకు మసాజ్ చేయాలి. ఇది కూడా చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది.
అరికాళ్ళలో నొప్పి నుండి ఉపశమనం పొందడానికి, ఆక్యుప్రెషర్ సహాయం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో కీళ్ల నొప్పుల నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. అయితే ఆక్యుప్రెషర్ చేసే ముందు తప్పనిసరిగా నిపుణుల సహాయం తీసుకోవాలి.
అరికాళ్ళలో నొప్పి అనిపిస్తే.. పసుపు నీరు ఉపకరిస్తుంది. ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో కాస్త పసుపు, ఉప్పు వేయాలి. ఆ తరువాత అందులో పాదాలను కాసేపు ముంచండి. దీంతో అరికాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏమైనా సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సలహాలు సూచనల మేరకు చికిత్స పొందాలి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..