మహిళలను ఎక్కువగా బాధిస్తున్న వెన్నునొప్పి సమస్య.. తగ్గించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

|

May 19, 2021 | 10:24 PM

కరోనా వైరస్ ప్రభావంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు ఇంట్లో ఉండే వర్క్ చేస్తున్నారు.

మహిళలను ఎక్కువగా బాధిస్తున్న వెన్నునొప్పి సమస్య.. తగ్గించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
Back Pain
Follow us on

కరోనా వైరస్ ప్రభావంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు ఇంట్లో ఉండే వర్క్ చేస్తున్నారు. ఇక గత సంవత్సర కాలంగా పలు కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వలన చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారు. నిత్యం ఎక్కువ గంటలు కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్ ముందు కూర్చోవడం.. ఇంట్లో సరైన ఎక్విప్ మెంట్ లేకుండా సరిగ్గా కూర్చోకపోవడం వలన చాలా మందిలో వెన్నునొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో వెన్ను నొప్పి సమస్య అధికంగా వస్తున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అవెంటో తెలుసుకుందామా.

1. మీరు కంప్యూటర్ ముందు పనిచేస్తున్నప్పుడు ఓకే భంగిమలో బిగుసుకుపోయి కూర్చోవద్దు. అలాగే కుర్చీలో వంగిపోయి కూర్చుంటే వెన్నుపూసపై భారం పడుతుంది. అందుకే నిటారుగా, తిన్నగా కూర్చోవాలి. అప్పుడే వెన్నుపూసకి విశ్రాంతి దొరుకుతుంది.
2. కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోని పనిచేస్తే వెన్నునొప్పి సమస్య ఎక్కువగా వస్తుంది. అందుకని మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. అలాగే శరీరానికి విశ్రాంతి అవసరం. పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తుండాలి. ఇలా చేయడం వలన నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
3. ఆవనూనెలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఆ నూనెను చల్లార్చి వెన్నుపూస మీద మర్ధనా చేయాలి. ఇలా చేస్తే వెన్ను నొప్పి తగ్గుతుంది.
4. వెన్ను నొప్పి ఎక్కువగా వస్తుంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి, టవల్ ను నీటిలో ముంచి, పిండాక దానితో వెన్నుపూస మీద కాపడం పెట్టండి. కొంతసేపటికి ఊరట కలుగుతుంది.

Also Read: ప్రపంచం నాశనం అయినా మన దగ్గర వేడి వేడి పాస్తా, చికెన్ రైస్.. ఎమర్జెన్సీ ఫుడ్ అంటూ పూరీ జగన్నాథ్ ఓపెన్ కామెంట్స్..

సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్న తమిళియన్స్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ పై మండిపడుతున్న ఆడియన్స్..