
Fish
శీతాకాలంలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఎముకలు కొరికే చలిలో ఎంతో మంది వృద్ధులు మరణిస్తుంటారు. ప్రస్తుతం విపరీతమైన చలి వేస్తోంది. ఈ సమయంలో వివిధ సీజనల్ వ్యాధులు వెంటాడుతుంటాయి. శీతాకాలపు వ్యాధిని నివారించడానికి ఉత్తమ మార్గం మన రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడం, పోషకాహారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. చలికాలంలో కాలానుగుణ వ్యాధులను నివారించడంలో చేపలు ఎంతోగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మీరు మీ ఆహారంలో చేపలను చేర్చుకుంటే అది ఆ పోషకాల లోపాన్ని తీరుస్తుంది.
అయితే చేపల్లో ఒమేగా అధికంగా ఉండటం వల్ల వివిధ రకాల వ్యాధులను తరిమికొడుతుందంటున్నారు. అన్ని కాలల పాటు చేపలను తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో వెంటాడుతున్న వ్యాధుల నుంచి రక్షించుకునేందుకు మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం.
శీతాకాలంలో చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
- చేపలు తినడం వల్ల శరీరంలోని అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపాన్ని తీరుస్తుంది. ఇది కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో ట్యూనా ఫిష్, సాల్మన్, మాకేరెల్ అవసరం. చల్లని వాతావరణంలో చర్మ సమస్యలు పెరగడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో చర్మం పొడిగా మారుతుంది. అలాగే చర్మం గ్లో వచ్చేలా చేస్తుంది. చేపలలో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 గ్లోను తిరిగి తీసుకురావడంలో సహాయపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్‌తో పాటు విటమిన్ బి12, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి.
- ఇలాంటి పోషకాలు సాల్మన్ ఫిష్‌లో ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఒమేగా-3 అధిక కొలెస్ట్రాల్‌పై ప్రభావాన్ని చూపుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు కూడా చాలా మేలు చేస్తాయి. దీన్ని తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఇది కాకుండా, ఇది శరీరం వచ్చే వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
- చలికాలంలో తరచుగా దగ్గు, జలుబుకు సంబంధించిన సమస్యలు వెంటాడుతాయి. శ్వాస సంబంధిత సమస్యలలో కూడా ఇది తన ప్రభావాన్ని చూపుతుంది. ఒమేగా-3 శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి