Winter Season: చలికాలం.. కరోనా నుంచి కోలుకున్నవారి ఉపిరితిత్తులకు మరింత ఇబ్బంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

|

Nov 03, 2021 | 9:41 AM

 కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత చాలామందిలో ఊపిరితిత్తులు మునుపటిలా పనిచేయడం లేదు. వారు ఇంకా కోలుకుంటున్నారు. వారికి సంరక్షణ అవసరం. చలికాలం మొదలైంది. దీపావళి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి.

Winter Season: చలికాలం.. కరోనా నుంచి కోలుకున్నవారి ఉపిరితిత్తులకు మరింత ఇబ్బంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Follow us on

Winter Season: కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత చాలామందిలో ఊపిరితిత్తులు మునుపటిలా పనిచేయడం లేదు. వారు ఇంకా కోలుకుంటున్నారు. వారికి సంరక్షణ అవసరం. చలికాలం మొదలైంది. దీపావళి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో కరోనా నుంచి కోలుకున్నవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల గురించి జాగ్రత్త తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 4 మిలియన్ల మంది శ్వాసకోశ వ్యాధుల కారణంగా అకాల మరణాన్ని పొందుతున్నారు. కోవిడ్‌ మహమ్మారి తర్వాత ఈ కేసులు మరింత పెరిగాయి. కోవిడ్ తర్వాత ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం..దీపావళి పొగలు అదేవిధంగా శీతాకాల ప్రభావాల నుండి వాటిని ఎలా రక్షించుకోవాలో.. నిపుణులు పలు సూచనలు చేశారు. అవేమిటో తెలుసుకుందాం..

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 విషయాలు ముఖ్యం..

బహిరంగంగా వ్యాయామం చేయడం మానుకోండి..

చలికాలంలో ఉదయం, సాయంత్రం వేళల్లో మంచు ఎక్కువగా ఉంటుందని, కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో వ్యాయామం చేయకుండా కేవలం గదిలోనే వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం గది వెంటిలేషన్ బాగా ఉందని నిర్ధారించుకోవాలి. చలికాలంలో బహిరంగంగా వ్యాయామం చేయడం గుండెకు కూడా హానికరం.

స్పిరోమెట్రీని ఉపయోగించండి

స్పిరోమెట్రీతో ఊపిరితిత్తులను బలోపేతం చేయండి. ఇది ఊపిరితిత్తుల వ్యాయామం. మీరు శ్వాసలోపం సమస్యను మళ్లీ మళ్లీ ఎదుర్కోవలసి వస్తే, స్పిరోమెట్రీని ఉపయోగించడం ఉత్తమ ఎంపిక. స్పిరోమెట్రీ అనేది పైపు ద్వారా ఊదాల్సిన పరికరం లాంటిది. దీంతో ఊపిరితిత్తుల పని సామర్థ్యం పెరుగుతుంది.

మాస్క్ తప్పనిసరి..

కోవిడ్ తర్వాత ఇప్పటికీ ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఇది రోగులకు అనేక విధాలుగా సహాయపడుతుంది. మొదటిది, పొగ.. కాలుష్యం కారణంగా గాలిలో ఉండే సూక్ష్మ కణాలను శరీరానికి చేరకుండా నిరోధిస్తుంది. రెండవది, ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

పల్స్ ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేయండి..

చలి కారణంగా శ్వాసనాళాలు కుంచించుకుపోతాయి కాబట్టి శీతాకాలంలో ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేయడం చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. పల్స్ ఆక్సిమీటర్ శరీరంలో ఆక్సిజన్ స్థాయి, అది ప్రమాదకర స్థాయిలో ఉన్నా లేదా సాధారణం కంటే కొంచెం ఎక్కువ లేదా తక్కువ అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. ప్రతిరోజు ఒకసారి పల్స్ ఆక్సిమీటర్‌తో మీ ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేయండి.

లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి

ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి స్పిరోమెట్రీ ఎంత ఎక్కువగా పనిచేస్తుందో, లోతైన శ్వాస వ్యాయామాల ప్రభావం అంత మెరుగ్గా ఉంటుంది. దీని కోసం ప్రాణాయామం.. అనులోమ్-విలోమ్ చేయండి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రాణాయామం పనిచేస్తుంది. ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతో ప్రాణాయామం చేయాలని గుర్తుంచుకోండి. రోజూ కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. అదే సమయంలో, శరీరంలో ఆక్సిజన్‌తో రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి అనులోమ్-విలోమ్ పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి: Diwali 2021: దీపావళి పండగకి ఈ రోగులు దూరంగా ఉండాలి.. లేదంటే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది..

Kilo Class Submarine: నేవీలో కలకలం రేపుతోన్న సబ్-మెరైన్ డేటా లీక్.. తాజా ఛార్జిషీట్‌ దాఖలుతో అధికారుల్లో గుబులు

Airtel: టెలికాం రంగంలో ఎయిర్‌టెల్‌కు లాభాల పంట.. రెండో త్రైమాసికంలో రూ.1,134 కోట్లు ఆదాయం