Alcohol: మందుబాబులకు ముఖ్య గమనిక..! ఆల్కాహాల్‌ను సోడా లేదా కూల్ డ్రింక్‌తో మిక్స్ చేసి తాగితే ఏమవుతుందో తెలుసా..?

|

Jun 20, 2023 | 6:36 PM

మద్యం ప్రియులు ఎక్కువగా నీళ్లు, సోడాతో ఆల్కహాల్‌ తాగుతుంటారు. అయితే, సోడాలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఇది ఆల్కహాల్‌తో కలిసిన వెంటనే ఆల్కహాల్‌లో బుడగలు కనిపిస్తాయి. ఇక సోడా ఆల్కహాల్ చేదు రుచిని తగ్గిస్తుంది. ఆల్కహాల్‌లో శీతల పానీయాలు, సోడాను కలపడానికి ప్రధాన కారణం ఇదే. కానీ,

Alcohol: మందుబాబులకు ముఖ్య గమనిక..! ఆల్కాహాల్‌ను సోడా లేదా కూల్ డ్రింక్‌తో మిక్స్ చేసి తాగితే ఏమవుతుందో తెలుసా..?
Alcohol
Follow us on

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా, తాగడం మాత్రం విడిచిపెట్టారు మద్యం ప్రియులు. ప్రపంచంలోని చాలా దేశాల్లో మద్యం ప్రియులు ఎక్కువగానే ఉంటారు. ఇక్కడ మనం వారిని తాగొద్దని చెప్పడం లేదు..కానీ, తాగే ముందు ఆల్కహాల్‌లో సోడా లేదా ఇతర కూల్‌డ్రింక్స్‌ కలుపుకుంటే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? కానీ, చాలా మంది కూల్‌డ్రింక్స్‌ లేదంటే, సోడా మిక్స్‌తో చేసిన ఆల్కహాల్‌ను తాగడానికి ఇష్టపడతారు. రుచి మారడమే దీనికి ప్రధాన కారణం. ఆల్కహాల్ చేదుగా ఉంటుంది. కాబట్టి, మందుబాబులు దానికి సోడా,లేదా కూల్‌డ్రింక్స్‌ వంటివి కలుపుకుని తాగుతారు. కానీ ఈ పద్దతి మీ ఆరోగ్యానికి హాని చేస్తుందని తెలిస్తే  షాక్‌ అవ్వాల్సిందే.

అది పబ్బు కావొచ్చు లేదంటే బార్ లేదా ఇల్లు కావచ్చు. కానీ, మద్యం ప్రియులు ఎక్కువగా నీళ్లు, సోడాతో ఆల్కహాల్‌ తాగుతుంటారు. అయితే, సోడాలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఇది ఆల్కహాల్‌తో కలిసిన వెంటనే ఆల్కహాల్‌లో బుడగలు కనిపిస్తాయి. ఇక సోడా ఆల్కహాల్ చేదు రుచిని తగ్గిస్తుంది. ఆల్కహాల్‌లో శీతల పానీయాలు, సోడాను కలపడానికి ప్రధాన కారణం ఇదే. కానీ, ఆల్కహాల్ లో సోడా కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సోడాతో కలిపిన ఆల్కహాల్ లోని కార్బన్ డై ఆక్సైడ్ మన రక్తంలో వేగంగా కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దీని ఆమ్లం శరీరంలోని కాల్షియంను ప్రభావితం చేస్తుంది. దాంతో మూత్రం ద్వారా కాల్షియం అధికంగా విసర్జించబడుతుంది. కాల్షియం కరిగిపోవడం వల్ల ఎముకలు బలహీనమవుతాయి.

ఆల్కహాల్, శీతల పానీయాలు రెండింటిలోనూ చక్కెర ఉంటుంది. వాటిని కలిపి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అనేక కూల్‌డ్రింక్స్‌లో కెఫిన్ కూడా ఉంటుంది. ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, ఆల్కహాల్‌తో సోడా లేదా శీతల పానీయాలను కలుపుకోకూడదని చెబుతున్నారు. రోజూ ఇదే పద్ధతిలో ఆల్కహాల్ కలిపి తాగే వారు డీహైడ్రేషన్ సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఆల్కహాల్‌తో పాటు సోడాను కలిపి తాగటం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..