
నేటి కాలంలో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తీసుకునే ఆహారం, మారుతున్న జీవనశైలి కారణంగా ఆడ, మగ తేడా లేకుండా జుట్టు రాలడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. మగవారిలో బట్టతల వస్తోంది. చాలా మంది జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు షాంపులను, నూనెలను మారుస్తుంటారు. కానీ, అవేం ఫలితం ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతారు.
తాజాగా వైద్యులు జుట్టు రాలడానికి మరో కారణానికి కొనుగొన్నారు. మాంసాహారుల కంటే శాఖాహారం తీసుకునేవారిలో జుట్టు రాలడం అనే సమస్య ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు.
జుట్టుకు అవసరమైన బీ12 విటమిన్ మాంసాహారం తీసుకునేవారికి పుష్కలంగా లభిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. అయితే, శాఖాహారులకు బీ12 పూర్తిస్థాయిలో లభించదు. దీని కారణంగా శాఖాహారుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటోంది. మీ జుట్టు ఒత్తుగా ఉండేందుకు బీ12 విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మాంసం లేదా చేపల నుంచి పొందే అమైనో ఆమ్లాలు శరీరం ప్రోటీన్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన బీ12 విటమిన్‌ను అందిస్తాయి. శాఖాహారులు తమ ఆహారంలో తగినంత బీ12 పొందకపోవడంతో జుట్టు రాలే సమస్యను ఎదుర్కొవాల్సి వస్తోంది.
శాఖాహారులైన వారు ఉదయం టీ లేదా కాఫీ లేదా స్మూతీ తాగేటప్పుడు పాలకు బదులుగా సోయా పాలు లేదా విటమిన్ బీ12 ఉన్న బాదంపాలు తీసుకోవచ్చు. విటమిన్ 12 ఉన్న రాగులు లేదా మిల్లెట్ ఫ్లేక్స్‌ను కూడా తీసుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు, కురులకు శక్తినిచ్చేందుకు విటమిన్ బీ12 పుష్కలంగా ఉన్న సోయా పాలు, బాదంపాలు, ప్రోటీన్ ఈష్ట్, పచ్చి శనగ రొట్టె, సోయా ముక్కలు, టోఫును మీరు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి.
ఇంకా, గూస్ బెర్రీస్ ఆరోగ్యకరమైన జుట్టుకు అనేక విధాలుగా ప్రయోజనకారిగా భావిస్తారు. వీటిలో యాంటిఆక్సిటెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో విటమిన్ సి, ఐరన్ కూడా లభిస్తుంది. జుట్టు పెరుగుదలకు ఇవి సహకరిస్తాయి. జుట్టు సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రతిరోజూ గూస్ బెర్రీస్ తినవచ్చని వైద్యులు
సూచిస్తున్నారు.