
వేరుశెనగల్లో సహజంగా ఉన్న కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అవసరమైన శక్తిని నింపుతాయి. వీటిని నీటిలో నానబెట్టి తీసుకుంటే తేలికగా జీర్ణమై శక్తిని త్వరగా అందిస్తాయి. శ్రమతో కూడిన పనులు చేసే వారికి ఇవి మంచి శక్తివంతమైన ఆహారంగా పనిచేస్తాయి. ఈ చిన్నపాటి గింజల్లో పొటాషియం, ఐరన్, జింక్, సెలీనియం, కాపర్, కాల్షియం వంటి అనేక ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో, రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
నానబెట్టిన పల్లీలు మానవ శరీరంలోని కండరాలను బలపరిచే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి కండరాల క్షీణతను నివారించడంలో సహకరిస్తాయి. వ్యాయామం చేస్తున్న వారికి వీటి వినియోగం మరింత మేలు చేస్తుంది.
పిల్లలు పెద్దలు ఉదయం పూట నానబెట్టిన వేరుశెనగలను తీసుకుంటే మెదడు చురుకుగా పని చేస్తుంది. వీటిలోని విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలు మెదడు కణాలకు ఆహారంగా పని చేస్తాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
పల్లీలను నానబెట్టి తినడం వల్ల చర్మం నిగారిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇవి శరీరంలో నుండి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అందువల్ల వయస్సు ప్రభావాలు ఆలస్యం అవుతాయి.
వేరుశెనగల్లోని కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల పటుత్వాన్ని పెంచడంలో కీలకంగా పని చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనతను తగ్గించడంలో ఇది సహజ పరిష్కారం.
నానబెట్టిన పల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల వెన్ను సంబంధిత నొప్పుల నుంచి ఉపశమనం లభించవచ్చు. బెల్లంలో ఉండే సహజ శక్తివంతమైన పదార్థాలు కలవడం వల్ల ఇది ఒక మంచి నేచురల్ రెమెడీగా పని చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారికి నానబెట్టిన వేరుశెనగలు ఒక వరంలా పని చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో మధుమేహ నియంత్రణకు ఇది సహజ చికిత్సగా పరిగణించవచ్చు.
అనేక పోషకాల సమ్మేళనంగా ఉండే వేరుశెనగలను నానబెట్టి తీసుకుంటే శరీరానికి మరింత ఉపయోగకరంగా మారతాయి. ప్రతిరోజూ ఉదయం కొద్ది మోతాదులోనైనా తీసుకుంటే ఆరోగ్యాన్ని బలోపేతం చేయడమే కాదు.. అనేక వ్యాధుల నుంచి నివారణ కూడా సాధ్యమవుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)