Health Tips: మీ అరచేతులు, అరికాళ్లు ఎక్కువగా చెమటలు పడుతున్నాయా..? హైపర్‌ హైడ్రోసిస్‌ కావచ్చు.. జాగ్రత్త..!

|

May 03, 2022 | 5:13 PM

Health Tips: వేసవి (Summer)లో వ్యాయామం చేసేటప్పుడు లేదా ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్నప్పుడు చెమటలు పట్టడం సహజం. అయితే కూర్చున్నప్పుడు కూడా చెమటలు..

Health Tips: మీ అరచేతులు, అరికాళ్లు ఎక్కువగా చెమటలు పడుతున్నాయా..? హైపర్‌ హైడ్రోసిస్‌ కావచ్చు.. జాగ్రత్త..!
Follow us on

Health Tips: వేసవి (Summer)లో వ్యాయామం చేసేటప్పుడు లేదా ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్నప్పుడు చెమటలు పట్టడం సహజం. అయితే కూర్చున్నప్పుడు కూడా చెమటలు పడుతున్నాయంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అరచేతులు, అరికాళ్ళలో చెమటలు పడుతుంటే వైద్యులను సంప్రదించడం మంచిదంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఈ సమస్యతో పోరాడుతున్నారు. సైన్స్ భాషలో దీనిని హైపర్ హైడ్రోసిస్ (Hyperhidrosis) అంటారు . సాధారణంగా శరీరం చెమట సహాయంతో దాని ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. అయితే హైపర్ హైడ్రోసిస్ బాధపడేవారు చలికాలంలో కూడా అరచేతులు, అరికాళ్ళ నుండి చెమట పట్టడం సమస్యను ఎదుర్కొంటారు.

మయోక్లినిక్ నివేదిక ప్రకారం.. మీరు మీ చేతులు, కాళ్ళ అరికాళ్ళపై అన్ని సమయాలలో చెమటలు పడుతూ ఉంటే హైపర్ హైడ్రోసిస్ సంకేతం. ఏదైనా వాతావరణంలో చెమటలు పడుతూ ఉంటే, ఎలాంటి శ్రమకు గురికానప్పుడు ఇలాంటి సమస్య ఎదుర్కొంటే వైద్యులను సంప్రదించండం మంచిది. ఇలా చెమటలు పడుతుంటే మీ శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే సమస్య పెద్దదిగా మారే ప్రమాదం ఉంది. ఉదాహరణకు అధిక చెమట, ఛాతీ నొప్పి, వాంతులు అవుతుంటే అప్రమత్తంగా ఉండాలి. అటువంటి సందర్భాలలో వైద్య నిపుణుల సలహా తీసుకోండి.

శరీరంలో ఉండే స్వేద గ్రంథి చెమటను విడుదల చేస్తుంది. చెమట గ్రంధికి చెమట పట్టేలా సూచించే నాడి శరీరంలో ఉంటుంది. అయితే ఈ స్వేద గ్రంధి యాక్టివ్‌గా మారినప్పుడు ఎక్కువ చెమట పట్టడం మొదలవుతుంది. మీరు ఏదైనా కష్టపడి పని చేస్తున్నా చెమటలు పట్టేస్తాయి. ఇది కాకుండా, ఇది అనేక ఇతర కారణాల వల్ల కూడా జరగవచ్చు. ఉదాహరణకు- మధుమేహం, రక్తంలో చక్కెర తగ్గడం, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండెపోటు, ఇన్ఫెక్షన్, థైరాయిడ్ సమస్య మొదలైనవి ఉన్నప్పుడు కూడా చెమటలు పడతాయి. అధిక ఒత్తిడి, భయం వంటి పరిస్థితుల్లో కూడా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల, ఖచ్చితమైన కారణాన్ని కనుగొనడానికి వైద్య సలహా తీసుకోండి. అధిక చెమట శరీరంలో తేమను పెంచుతుంది కాబట్టి పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. దీని వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. అందుకే వైద్యులను సంప్రదించడం మంచిదంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Spices To Avoid In Summer: వేసవిలో ఈ 4 మసాలాలు తినడం ప్రమాదమే..! అవేంటో తెలుసుకోండి

Heat Stroke: హీట్‌స్ట్రోక్ శరీరంలో ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది.. లక్షణాలు ఏమిటి?