Cardiac Arrest: మారుతున్న కాలానుగుణంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడి లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. రోజువారీ ఆహారపు అలవాట్ల కారణంగా మానవుడికి వ్యాధులు దరిచేరుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో గుండెపోటుతో బాధపడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఒకప్పుడు అధిక వయసు ఉన్నవారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో యుక్త వయసులో ఉన్నవారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. పాతికేళ్ల వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు.
కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి?
కార్డియాక్ అరెస్ట్ అనేది మీ గుండె కొట్టుకోవడం ఆగిపోవడం. ఇది జరిగినప్పుడు, మీ ముఖ్యమైన అవయవాలు ఇకపై ఆక్సిజన్‌తో నిండిన రక్తాన్ని తీసుకోలేవు. దీంతో ఇది మీ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. కొందరు వ్యక్తులు “కార్డియాక్ అరెస్ట్,” “హార్ట్ ఎటాక్”, “హార్ట్ ఫెయిల్యూర్” అనే పదాలను పరస్పరం ఒకటిగానే భావిస్తారు. కానీ, ఈ పరిస్థితులు ఒక్కొక్కటి కొద్దిగా భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ అవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి.
ఎక్కువగా బాత్‌రూమ్‌లోనే గుండెపోటు..
చాలా మంది బాత్‌రూమ్‌లోనే గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. మరీ బాత్‌రూమ్‌లోనే ఎందుకు గుండెపోటు వస్తుందనే దానిపై పరిశోధకులు పరిశోధనలు చేయగా, పలు విషయాలు వెల్లడైనట్లు పరిశోధకులు చెబుతున్నారు. గుండెకు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు బాత్‌రూమ్‌లో వెళ్లినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఏజెన్సీ ఎన్‌సీబీఐ నివేదిక ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం గుండెపోటు మరణాలు బాత్‌రూమమ్‌లోనే జరుగుతున్నాయని గుర్తించారు.
- స్నానం చేసేటప్పుడు చాలా మంది ముందుగా తలని రుద్దుకుంటారు. దాని వల్ల వేడి రక్తం గల శరీరం ఒక్కసారిగా చల్లటి ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అన్ని విధాలుగా తల భాగం వైపు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రక్త నాళాల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటు వస్తుందని చెబుతున్నారు. అయితే శీతాకాలంలో ఇలాంటి గుండెపోటు ఘటనలు ఎక్కువగా సంభవిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
- పైవైపు వెళ్లకపోవడమే మంచిది.. స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాలను తడుపుకొని ఆ తర్వాత పైవైపు వెళ్లకుండా ఉండడమే మంచిదని, ముఖ్యంగా రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మైగ్రేన్‌తో బాధపడుతున్నవారు ఇలాంటివి పాటించాలంటున్నారు.
- మలబద్దకం సమస్యతో.. ఇక మలమద్దకం సమస్యతో బాధపడుతున్నవారు విసర్జన సమయంలో బాత్‌రూమ్‌లో ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి సమయంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే గుండెకు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారితో పాటు మలబద్దకం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తలపై నుంచి స్నానం చేసే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు.
- చలికాలంలో ఎక్కువగా గుండెపోటు.. శీతాకాలంలో రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఇరుకైన రక్తనాళాల గుండా రక్తం వెళ్లడానికి ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా రక్తపోటు వచ్చే అవకాశాలుంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. తీవ్రమైన చలి సమయంలో రక్తం మందంగా, జిగటగా మారుతుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని సులభతరం చేస్తుంది. చాలా స్ట్రోక్స్ రక్తం గడ్డకట్టడం వల్లనే సంభవిస్తాయి. న్యూయార్క్ మౌంట్ సినాయ్ ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. శీతాకాలంలో జలుబు, ఫ్లూ నుంచి రక్షణ పొందడానికి రోగనిరోధక వ్యవస్థ రక్త స్థాయిలు అనేక రెట్లు పెరుగుతాయి. దీనివల్ల ధమనుల గోడలపై ప్లేక్స్ పేరుకుపోతాయి. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
- గుండె సమస్యలను తగ్గించుకోవాలంటే.. అయితే గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిలో ముఖ్యంగా నిత్యం 20 నిమిషాల సూర్యకాంతిలో ఉండటం, ఆహారంలో 30 శాతం ప్రొటీన్లు తీసుకోవడం, రోజూ 40 నిమిషాలు పాటు వ్యాయామం చేయడం వంటివి. వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. వీటిని పాటించడం వల్ల చలికాలంలో గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు కనీసం 20 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉన్నట్లయితే గుండెకు సంబంధిత వ్యాధుల నుంచి దూరం కావచ్చంటున్నారు. సూర్యరశ్మి కారణంగా శరీరం శరీరంలో యాంటీబాడీలను ఎక్కువగా తయారవుతాయి. ఈ సూర్యకాంతి మనకు వాపు, అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. మెదడు పని చేసే సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది. అందువల్ల నిత్యం 20 నిమిషాలపాటు ఉదయం ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. చలికాలంలో ప్రతి రోజు కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల గుండె సమస్యల నుంచి గట్టెక్కవచ్చంటున్నారు నిపుణులు.
- బాత్రూంలో కార్డియాక్ అరెస్ట్ ఎందుకు జరగవచ్చు? గుండెకు విద్యుత్తు లోపం ఉన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇది క్రమరహిత హృదయ స్పందనకు కారణమవుతుంది. మీరు స్నానం చేస్తున్నప్పుడు, మలవిసర్జన సమయంలో లేదా ప్రేగు కదలికలో ఉన్నప్పుడు ఇలా గుండె పనిచేయకపోవడం ఎక్కువగా జరగవచ్చు. ఎందుకంటే, ఈ కార్యకలాపాలు మీ శరీరంపై ఒత్తిడిని కలిగిస్తాయి.
- టాయిలెట్ ఉపయోగించడం: మలవిసర్జన సమయంలో మీరు ప్రేగు కదలికను కలిగి ఉన్నప్పుడు, మీకు మీరే ఒత్తిడికి గురవుతారు లేదా శ్రమించవచ్చు. ఇది అసాధారణమైనది కాదు, కానీ ఇది మీ హృదయాన్ని ఒత్తిడికి గురి చేస్తుంది. మీ గుండె పనితీరు ఇప్పటికే కొంత ఇబ్బందిలో ఉంటే, ఇది ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ కోసం ఒక ట్రిగ్గర్ కావచ్చు. బాత్రూమ్‌కు వెళ్లడం కూడా వాసోవాగల్ ప్రతిస్పందన అని పిలువబడుతుంది. బాత్రూమ్‌ని ఉపయోగించడం వల్ల వాగస్ నాడిపై ఒత్తిడి ఏర్పడుతుంది, ఇది కొన్నిసార్లు మీ హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది.
- స్నానం : చాలా చల్లగా ఉండే నీటిలో స్నానం చేయడం (70 ° F కంటే తక్కువ నీటి ఉష్ణోగ్రత) లేదా చాలా వేడిగా (నీటి ఉష్ణోగ్రత 112 ° F కంటే ఎక్కువ) మీ హృదయ స్పందన రేటును త్వరగా ప్రభావితం చేయవచ్చు. షవర్‌లో మీ శరీర ఉష్ణోగ్రత వేగంగా సర్దుతున్నందున, ఇది మీ ధమనులు, కేశనాళికలపై ఒత్తిడిని కలిగిస్తుంది. షవర్‌లో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌లు ఎంత తరచుగా జరుగుతాయనే దానిపై పెద్దగా డేటా అందుబాటులో లేదు. ఏదేమైనా, మీ వాస్కులర్ సిస్టమ్‌పై ఒత్తిడి కలిగించే ఒత్తిడి కారణంగా ఈ సెట్టింగ్ ఇతరులకన్నా కార్డియాక్ అరెస్ట్‌కు సర్వసాధారణంగా ఉంటుందని అర్ధమవుతుంది. మీ భుజాలకు పైన ఉన్న నీటిలో స్నానం చేయడం అధిక రక్తపోటు లేదా గుండె జబ్బు వంటి ముందస్తు హృదయ సంబంధ పరిస్థితులను కలిగి ఉన్న వ్యక్తులకు అదనపు ప్రమాదాలను కలిగించవచ్చు.
- మందుల వినియోగం..: మందుల అధిక మోతాదు కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా గుండె స్ధంబనకు దారితీస్తుంది. కొన్నిరకాల మందుల అధిక మోతాదు కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసే అవకాశం ఉంది. అలాగే, ఈ మందులు బాత్రూంలో ప్రవేశించడానికి ముందు ఉపయోగించినట్లయితే, మీరు అక్కడ ఉన్నప్పుడు గుండె స్ధంబనకు ఇది కారణం కావచ్చు.
- మీకు బాత్రూంలో సహాయం అవసరమైతే ఏమి చేయాలి: ఏదైనా కారణం వల్ల మీకు బాత్రూంలో వైద్య సహాయం అవసరమైతే మీకు ఇబ్బంది అనిపించినా సహాయం పొందడం ముఖ్యం. మీరు బాత్రూమ్‌లో ఉన్నట్లయితే మీరు ఎవరినైనా హెచ్చరించాలి.
మీరు బాత్రూమ్ లో ఉండగా ఈ లక్షణాలు అనుభవిస్తే అది గుండెనొప్పికి సంకేతంగా భావించాల్సి ఉంటుంది.
☛ ఛాతి నొప్పి
☛ ఆకస్మిక శ్వాసలోపం
☛ మైకము
☛ వాంతులు
☛ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
☛ మూర్ఛపోవడం
☛ మీకు కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఎక్కువగా ఉంటే, మీరు నివసిస్తున్న ఎవరికైనా తెలియజేయండి, తద్వారా వారు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడగలరు.
ఈ కారకాలు గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి:
☛ ఊబకాయం
☛ అధిక రక్త పోటు
☛ మధుమేహం
☛ గుండె జబ్బు యొక్క కుటుంబ చరిత్ర
☛ వయస్సు 65 , అంతకంటే ఎక్కువ
☛ మీరు కుటుంబ సభ్యుడు లేదా రూమ్‌మేట్‌తో “భద్రతా వ్యవస్థ” కలిగి ఉండాలనుకోవచ్చు. మీరు బాత్రూంలో ఉన్న సమయం ఎక్కువ అనిపించినపుడు మీ కుటుంబ సభ్యులు లేదా మీ రూమ్‌మేట్ తనిఖీ చేయవచ్చు. అటువంటి సమయంలో వారు తలుపు తడితే, అప్పుడు మీరు వేగంగా స్పందించకపోతే వారు మీకు సహాయం అవసరమని భావించవచ్చు. అలాంటప్పుడు వారు వేగంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి