
మటన్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు దీనిని మితిమీరిన స్థాయిలో తీసుకుంటే అనారోగ్యం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. మరికొందరు మాత్రం ఆరోగ్య పరిస్థితుల వల్ల మటన్ తినకూడదు. మరి ఎవరు మటన్ ని తినకూడదో. ఎందుకు తినకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మటన్ లో ఉండే పోషక విలువలు మీకు తెలుసా..? 100 గ్రాముల మటన్ లో 143 కేలరీలు, 27 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల కొవ్వు, 86 మి.గ్రా సోడియం, 3.7 మి.గ్రా ఐరన్, 75 మి.గ్రా కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇప్పుడు మటన్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఇక మటన్ ఎక్కువగా తింటే జరిగే హానికర ప్రభావాల విషయానికి వస్తే.. మటన్‌ను ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక కొవ్వుతో ఉన్న మటన్ తరచూ తీసుకుంటే గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది. అధిక మోతాదులో తీసుకుంటే శరీరానికి వేడిని కలిగించడంతో పాటు మూత్రపిండాలకు, కాలేయానికి సమస్యలు తలెత్తుతాయి. ఏ ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదో తెలుసుకుందాం.
కాలేయం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు మటన్ ని పూర్తిగా నివారించాలి. మటన్‌లో అధికంగా ఉండే ప్రోటీన్, కొవ్వు కారణంగా లివర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారు దీన్ని తినకపోవడమే ఉత్తమం.
హై బీపీ ఉన్నవారు మటన్‌ను మితంగా తినాలి. దీనిలో సోడియం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల రక్తపోటును పెంచే అవకాశం ఉంది. ఇది గుండెపోటు, స్ట్రోక్‌లకు దారి తీస్తుంది.
మటన్ లో అధిక ప్రోటీన్ ఉండడం వల్ల మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని పూర్తిగా మానేయడం మంచిది.
గర్భిణీలు మటన్ ని మితంగా తీసుకోవాలి. చాలా వేడిగా ఉండే ఈ ఆహారం గర్భస్రావానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లలు అధిక మోతాదులో మటన్ తినకూడదు.
కొంతమందికి శరీరంలో సహజంగానే ఎక్కువ వేడి ఉంటుంది. అటువంటి వారు మేక మాంసాన్ని తీసుకుంటే తలనొప్పి, కడుపు సమస్యలు, మంట వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)