White Pepper: క్యాన్సర్‏ను నయం చేసే తెల్ల మిరియాలు.. నల్ల మిరియాల కంటే తెల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయంటే..

|

Jul 01, 2021 | 12:10 PM

మనం ఎక్కువగా వంటలలోకి నల్ల మిరియాలను ఉపయోగిస్తుంటాం. మన భారతీయ వంటలలో నల్ల మిరియాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు.

White Pepper: క్యాన్సర్‏ను నయం చేసే తెల్ల మిరియాలు.. నల్ల మిరియాల కంటే తెల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయంటే..
White Pepper
Follow us on

మనం ఎక్కువగా వంటలలోకి నల్ల మిరియాలను ఉపయోగిస్తుంటాం. మన భారతీయ వంటలలో నల్ల మిరియాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటితోపాటు.. తెల్ల మిరియాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తలనొప్పిని తగ్గించడంతోపాటు.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ తెల్ల మిరియాలు ఎంతో సహాయపడతాయి. అయితే వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందమా..

తెల్ల మిరియాలలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇవి ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. అలాగే తిమ్మిరులు, వణుకు వంటి సమస్యల నుంచి ఉపశమనం అందిస్తాయి. ఇందులో ఉండే క్యాప్సైసిన్ కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అంతేకాదు.. క్యాన్సర్ ను తగ్గించేందుకు సహాయపడతాయి. కొన్ని అధ్యాయనాల ప్రకారం క్యాప్సైసిన్ కంటెంట్ శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. తెల్ల మిరియాలు ప్రోస్టేట్ క్యాన్సర్ ను నయం చేయడంలో ఉపయోగపడుతుంది.

గొంతు నొప్పిని తగ్గిస్తాయి. తెల్ల మిరియాలు యాంటీ బయాటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సీ, ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని వ్యర్థ ద్రావాన్ని తొలగిస్తాయి. దీంతో గుండెపై ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

తెల్ల మిరియాల పొడిని వంటలలో, సలాడ్స్ లలో సూప్స్ లలో ఉపయోగించవచ్చు. వేయించిన బియ్యంతోపాటు.. తెల్ల మిరియాల పొడిని తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Also Read: Ravi Teja 68: నయా మూవీ షూటింగ్ షురూ చేసిన మాస్ రాజా.. ఇంటరెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్

Tulsi Tree: ఇంట్లో తులసి చెట్టును రోజూ ఇలా పూజించడం వలన కలిగే ప్రయోజనాలెంటో తెలుసా.. ఎందుకు ఆరాధించాలంటే…

Curry Leaves benefits: తినేప్పుడు కరవేపాకును పడేస్తున్నారా ? అయితే మీరు ఈ ప్రయోజనాలను తెలుసుకోవాల్సిందే…