మగువలకు ఇష్టమైన వాటిల్లో గోళ్లు కూడా ఒకటి. వీటిని పెంచడానికి నానా కష్టాలు పడుతూంటారు. అంతేకాకుండా ఎన్నో రకాల నెయిల్ పాలిష్ లు వాడుతూ వాటిని అందంగా తీర్చి దిద్దుతారు. మ్యానీ క్యూర్, పెడిక్యూర్ అంటూ గోళ్లకు మరింత బ్యూటీని చేర్చుతున్నారు. ఇలా చేయించు కోవడం కూడా మంచిదే. ఎందుకంటే గోళ్లలో ఎమైనా మట్టి లాంటివి ఉంటే పోతాయి. ఎక్కువగా వేళ్ల ద్వారానే బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు నోట్లోకి వెళ్లిపోతాయి. అయితే గోళ్ల ద్వారా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో తెలుసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. గోళ్ల రంగును అర్థం చేసుకుంటే.. మన ఆరోగ్యాన్ని తెలుపుతాయట. మరి గోళ్లు ఏ రంగులో ఎలాంటి ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
పసుపు రంగు గోళ్లు:
గోళ్లు పసుపు రంగులో ఉంటే.. బాడీ ఇన్ ఫెక్షన్లకు గురైనట్టు. ఇన్ ఫెక్షన్లు కాకుండా పసుపు రంగులో మారితే.. థైరాయిడ్, ఊపిరి తిత్తులు, షుగర్ వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి.
పొరలు, పొరలుగా ఉండే గోళ్లు:
కొందరికి గోళ్లు పొరలు పొరలుగా విరుగుతూంటాయి. ఇలా ఉంటే కనుక వారికి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అవి మెల్లగా పసుపు రంగులోకి మారితే అప్రమత్తం కావాలి. వెంటనే థైరాయిడ్ టెస్టులు చేయించుకోవడం బెటర్.
గోళ్లపై తెల్లని మచ్చలు:
కొంత మందికి గోళ్లపై తెల్లని మచ్చలు వస్తూంటాయి. ఇలా ఉంటే వారు పోషకాహారం, కాల్షియం లోపంతో ఉన్నట్లని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఐరన్ లోపం కూడా అయి ఉండవచ్చ. గోళ్ల పై తెల్లని మచ్చలు ఉంటే మాత్రం వైద్యలు సలహాలు తీసుకుని చికిత్స తీసుకోవడం ఉత్తమం.
గుంటలు పడిన గోళ్లు:
కొంత మందికి గోళ్ల పై భాగంపై చిన్న చిన్న గుంటలు కనిపిస్తాయి. ఇన్ ఫ్లమేటరీ ఆర్థరైటీస్ సమస్యలతో బాధపడుతున్న వారికి గోళ్లపై చిన్న గుంటలు ఉంటాయి. ఇలా ఉంటే ముందు నుంచే జాగ్రత్త పడటం ఉత్తమం.
నీటి రంగు గోళ్లు:
కొంత మంది గోళ్లు నీలం రంగులో ఉంటాయి. శరీరానికి సరైన మోతాదులో ఆక్సిజన్ అందక పోయినా లేదా గుండె, ఊపిరి తిత్తుల సమస్యల ఉన్నావారికి కూడా గోళ్లు నీలం రంగులోనే ఉంటాయి.
పాలిపోయిన గోళ్లు:
కొంతమందికి గోళ్లు పాలిపోయి తెల్లగా కనిపిస్తాయి. ఇలాంటి వారు పోషకాహార లోపం, రక్త హీనత, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతూంటారని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.