Health: కాళ్లు, ముఖం ఉబ్బినట్లు అనిపిస్తుందా.. అయితే ఆ ప్రమాదకర వ్యాధే

|

Jul 10, 2024 | 4:00 PM

మన దేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ప్రచురించిన జర్నల్‌లో పొందుపరిచారు. కిడ్నీ సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే.. సమస్య తీవ్రతరం కాకుండా జాగ్రత్తపడొచ్చు.

Health: కాళ్లు, ముఖం ఉబ్బినట్లు అనిపిస్తుందా.. అయితే ఆ ప్రమాదకర వ్యాధే
Swelling In Feet
Follow us on

మన శరీరంలో కీడ్నీలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. రక్తంలోని వ్యర్థాలను ఫ్యూరిఫై చేసి బయటకు పంపడంలో ఇవి కీ రోల్ పోషిస్తాయి. మన దేశంలో అనారోగ్యం వల్ల సంభవించే మరణాలకు ప్రధాన కారణాల్లో కిడ్నీ సమస్యలు కూడా ఉన్నాయి. మన తినే ఫుడ్, లైఫ్ స్టైల్, అలవాట్లు, కొన్ని రకాల మెడిసిన్స్ కిడ్నీలపై ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు కిడ్నీల పనితీరు 90% తగ్గేవరకు లక్షణాలు కనపడకపోవచ్చని ప్రముఖ నెప్రాలజిస్ట్.. పీఎస్ వలి తెలిపారు. కిడ్నీ పనితీరు గణనీయంగా తగ్గిన తర్వాతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఆయన వివరించారు…

కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు:

1.  కాళ్లు, ముఖం ఉబ్బడం:
కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయకపోతే, శరీరంలో ద్రవం నిల్వ అవడం వల్ల కాళ్లు, ముఖం, శరీరంలోని ఇతర భాగాలు ఉబ్బుతాయి.

2.  చిన్న వయసులో హై బీపీ రావడం:
చిన్న వయసులోనే రక్తపోటు పెరగడం కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. కిడ్నీలు రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

3.  రాత్రిపూట యూరిన్ కోసం ఎక్కువ సార్లు లేవడం:
రాత్రిపూట ఎక్కువ సార్లు మలమూత్రాల కోసం లేవడం కూడా కిడ్నీ పనితీరు సమస్యకు సంకేతం కావచ్చు.

4.  యూరిన్‌లో రక్తం లేదా కోలా కలర్:
యూరిన్‌లో రక్తం కనిపించడం లేదా యూరిన్ రంగు మారి కాఫీ రంగులో రావడం కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు.

5. శరీరంలో ద్రవం నిల్వ అవడం వల్ల శ్వాస సమస్యలు:
కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు శరీరంలో ద్రవం నిల్వ అవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు.

6.  వాంతులు, అన్నం అస్సలు సహించకపోవడం, శరీరంలో దురద:
కిడ్నీలు సరిగా పని చేయకపోతే, శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి వాంతులు, అన్నం తినడంలో ఇబ్బంది, శరీరంలో దురద రావడం సాధారణం.

పై లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కిడ్నీ ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలించి, తగిన పరీక్షలు చేయించడం ద్వారా కిడ్నీ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరు మెరుగుపరచుకోవచ్చు.

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..