Leafy Vegetables: ఆకుకూరల్లో పోషకాలు పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

|

Aug 19, 2023 | 5:32 PM

ప్రతి రోజూ మనం తినే ఆహార పదార్థాల్లో దాదాపుగా ఫ్రిడ్జ్ లో నిల్వఉంచిన వాటితో వండేవే. రోజూ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెచ్చుకునేంత సమయం లేక.. వారానికి ఒకసారి.. లేదా వారంలో రెండుసార్లు మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొని తెచ్చుకుంటాం. వాటిలో కొన్నింటిని ఫ్రిడ్జ్ లో పెట్టి.. రోజూ కావలసినవి తీసుకుని వండుకుంటాం. అసలు ఫ్రిడ్జ్ లో ఉంచకుండా.. తాజాగా దొరికే కూరగాయల్ని తినడమే ఆరోగ్యానికి మంచిది. ఆకుకూరలు తింటే ఇంకా మంచిది. ముఖ్యంగా.. వారానికి మూడుసార్లైనా ఆకుకూరలు తింటే..

Leafy Vegetables: ఆకుకూరల్లో పోషకాలు పోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
Leafy vegetables
Follow us on

ప్రతి రోజూ మనం తినే ఆహార పదార్థాల్లో దాదాపుగా ఫ్రిడ్జ్ లో నిల్వఉంచిన వాటితో వండేవే. రోజూ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తెచ్చుకునేంత సమయం లేక.. వారానికి ఒకసారి.. లేదా వారంలో రెండుసార్లు మార్కెట్ కి వెళ్లి కూరగాయలు కొని తెచ్చుకుంటాం. వాటిలో కొన్నింటిని ఫ్రిడ్జ్ లో పెట్టి.. రోజూ కావలసినవి తీసుకుని వండుకుంటాం. అసలు ఫ్రిడ్జ్ లో ఉంచకుండా.. తాజాగా దొరికే కూరగాయల్ని తినడమే ఆరోగ్యానికి మంచిది. ఆకుకూరలు తింటే ఇంకా మంచిది. ముఖ్యంగా.. వారానికి మూడుసార్లైనా ఆకుకూరలు తింటే.. కంటి ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కంటి చూపుకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఆకుకూరలను ఎలా వాడితే, ఎలా వండుకుంటే వాటిలోని పోషకాలు పోకుండా ఉంటాయో తెలుసుకుందాం.

-ఆకుకూరలు ఏవైనా సూర్యరశ్మి (ఎండ) తగలని ప్రదేశంలో ఉంచాలి. ఎండ తగిలితే ఆకు కూరల్లో ఉండే కెరోటిన్ అనే పోషక పదార్థం నశిస్తుంది.

-వండటానికి ముందు ఆకుకూరలను శుభ్రంగా కడగాలి. వాటి పెంపకం సమయంలో చల్లిన మందుల వాసన పోయేందుకు, వాటి వేర్లకు ఉండే మట్టి పోయేందుకు ఉప్పు వేసిన నీటిలో ఆకుకూరల్ని కడగాలి.

ఇవి కూడా చదవండి

-ఆకుల్ని మరీ చిన్న చిన్నగా కాకుండా.. కాస్త పెద్దగా తరిగి వండుకోవాలి. అసలు తరగకుండా వండుకుంటే ఇంకా మంచిది.

-తాజాగా ఉన్న ఆకుకూరలనే వంటకు వాడుకోవాలి. నిలువ ఉంచిన, వాడిపోయిన ఆకుకూరల్లో పోషకాలు, విటమిన్లు తగ్గిపోతాయి.

-ఆకుకూరల్ని వేయించి తినకూడదు. అలా చేస్తే.. వాటిలో ఉండే ఖనిజాలు, విటమిన్లన్నీ పోయి.. వట్టి పిప్పి మాత్రమే మిగులుతుంది.

-క్యారెట్, ముల్లంగి వంటి దుంపకూరలను వండేటప్పుడు.. వాటికి ఉండే ఆకులను కూడా వండుకుని తినొచ్చు. వాటిలో కూడా శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి.

-మెంతుల్ని తినలేనివారు.. మెంతికూరను వండుకుని తినొచ్చు. మెంతికూరలో కాస్తంత పప్పు కలుపుకుని వండుకుంటే.. ఎక్కువ చేదు లేకుండా ఉంటుంది.

-చుక్కకూర.. ఇది రుచికి గోంగూర మాదిరిగా పుల్లగా ఉంటుంది. ఇది పురుషుల లైంగిక సామర్థ్యాన్ని, వీర్యకణాల సంఖ్యను పెంచడంలో ఉపయోగపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి