Banana
Banana Health Benefits: అరటిపండు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏ సమయంలో తినడం మంచిది..? ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి హానికరం.. అనే విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. అరటిలో పిండిపదార్థాలు, చక్కెరలు (కార్బోహైడ్రేటులు) ఎక్కువగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అరటి పండులో 20 గ్రాముల పిండిపదార్థాలు, 1 గ్రాము మాంసకృత్తులు, 0.2 గ్రాముల కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి లాంటివి ఉన్నాయి. అరటిపండు సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా కాపాడుతుంది. దేశంలో మొత్తం 50 రకాల అరటిపండ్లు వరకు లభిస్తున్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల మీ శరీరానికి 100% కేలరీలు అందుతాయి. అరటిపండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటీ..? ఎప్పుడు తినాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
అరటిపండ్లు తినడానికి సరైన సమయం ఉందా?
- పండిన, తాజాగా పండిన అరటిపండుకు.. పండనటువంటి అరటికి దాని రుచి, పోషక విలువలు మారుతాయి. ఇంకా కొన్ని సందర్భాల్లో అరటిని తినడం మంచిది కాదు. అందుకే ఆ వివరాలను తెలుసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.
- పండిన అరటిపండు తాజాదానికంటే తియ్యగా ఉంటుంది. తాజాగా పండిన అరటిపండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- అతిగా పండిన అరటిపండు అంటే.. పై తొక్క కొద్దిగా గోధుమ రంగులోకి మారుతుంది. కావున దీన్ని రోజూ తినడం వల్ల మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. అరటిపండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది మీ శరీరంలో అమైనో ఆమ్లాన్ని అందిస్తుంది.
- ఇది మీ శరీరం సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరోటోనిన్ ఒక ముఖ్యమైన మెదడు రసాయనం. ఇది సహజమైన యాంటీ డిప్రెసెంట్, ఆందోళన, నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పరగడుపున అరటిపండు తింటే ఏమవుతుంది..?
- దగ్గుతో బాధపడేవారు రాత్రిపూట అరటిపండ్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి.
- కానీ ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. అరటిపండులో అసిడిక్ గుణాలు ఉన్నాయి. కావున వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల పేగు సమస్యలు వస్తాయి.
- మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత తింటే మంచిది. అరటిపండును సలాడ్ రూపంలో, జ్యూస్, ఇంకా బనానా షేక్ తయారు చేసుకోని తీసుకోవచ్చు.
ఈ రోజుల్లో మీరు కొనుగోలు చేసే దాదాపు ప్రతి పండు, కూరగాయలు రసాయన పురుగుమందులతో పండిస్తున్నారు. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినడం ఆరోగ్యానికి హానికరం.
ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి