AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సమస్యలు ఉన్నవారు శీతాకాలంలో జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే ప్రాణాలకే ముప్పు..

శీతాకాలంలో ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్వాసకి సంబంధించిన సమస్యలు వీరిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎందుకంటే కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆస్తమా రోగులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఆస్తమా ఉన్నవారు ఊపిరితిత్తులను

ఈ సమస్యలు ఉన్నవారు  శీతాకాలంలో జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే ప్రాణాలకే ముప్పు..
Asthma Patients
Amarnadh Daneti
|

Updated on: Nov 21, 2022 | 1:41 PM

Share

శీతాకాలంలో ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్వాసకి సంబంధించిన సమస్యలు వీరిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎందుకంటే కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆస్తమా రోగులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఆస్తమా ఉన్నవారు ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి శ్వాస వ్యాయామాలు ప్రారంభించాలని నిపుణులు అంటున్నారు. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఉబ్బసం రోగులు అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే శీతాకాలం నుంచి తప్పించుకోగలుగుతారని చెబుతున్నారు.  దాదాపు ప్రపంచంలో 235 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ వ్యాధి వృద్ధులు, పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. వాహనాల పొగ వల్ల వచ్చే కాలుష్యం కారణంగా ఏటా 40 లక్షల మంది చిన్నారులు ఆస్తమా బారిన పడుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఉబ్బసం అంతర్లీన కారణాలు పూర్తిగా అర్థం కాలేదు. కానీ జన్యుపరమైన కారకాలు కాకుండా, అలెర్జీల ఆవిర్భావం కారణంగా ఇది సంభవిస్తుంది.

ఆస్తమా అంటే

ఆస్తమా అనేది ఊపిరితిత్తుల వ్యాధి. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. శ్వాస గొట్టాలలో వాపు ఉంటుంది. దీని కారణంగా శ్వాస మార్గం ఇరుకుగా మారుతుంది. శ్వాసకోశ సంకుచితం కారణంగా రోగికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. శ్వాసలో ధ్వని, ఛాతీ బిగుతు, దగ్గు వంటి సమస్యలు మొదలవుతాయి. గాలిలో విపరీతమైన కాలుష్యం కారణంగా ఆస్తమా రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరాడకుండా దగ్గు ఉంటుంది.

ఆస్తమా నుంచి రక్షణ

ఆస్తమా రోగులు దుమ్ము, మట్టి లేదా బహిరంగ వాతావరణానికి దూరంగా ఉండాలి. ధూమపానం చేయకూడదు. అంతే కాకుండా చల్లని ప్రదేశాలు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ఆస్తమా వ్యాధిగ్రస్తులు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి. దుమ్ము, ధూళి మీకు శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది ఆస్తమా అటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!