Health: పక్షులతో గడిపే అలవాటు ఉందా.? అయితే మీకు ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త.

|

Mar 11, 2023 | 4:41 PM

ఇటీవల నటి మీనా భర్త విద్యాసాగర్‌ మరణించిన సమయంలో ఓ వార్త బాగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. విద్యా సాగర్‌ మరణానికి పావురాలపై కారణమని వార్తా కథనాలు వెల్లువడ్డాయి. మీనా నివసించే ఇంటికి సమీపంలో చాలా పావురాలు ఉంటాయని.. వాటి వ్యర్థాలు కలిసిన గాలి పీలుస్తుండటంతో...

Health: పక్షులతో గడిపే అలవాటు ఉందా.? అయితే మీకు ఈ ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త.
Bird Breeder's Lung Disease
Follow us on

ఇటీవల నటి మీనా భర్త విద్యాసాగర్‌ మరణించిన సమయంలో ఓ వార్త బాగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. విద్యా సాగర్‌ మరణానికి పావురాలే కారణమని వార్తా కథనాలు వెల్లువడ్డాయి. మీనా నివసించే ఇంటికి సమీపంలో చాలా పావురాలు ఉంటాయని.. వాటి వ్యర్థాలు కలిసిన గాలి పీలుస్తుండటంతో ఇంట్లో అందరి లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ సోకిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను మీనా ఖండించారు కూడా. ఇదిలా ఉంటే నిజంగానే పక్షుల కారణంగా మనుషులకు వ్యాధులు వస్తాయా అంటే నిజమేనని చెబుతున్నారు నిపుణులు. ఇప్పుడు ఇదంతా ఎందుకనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పక్షుల కారణంగా ‘బర్డ్ బ్రీడర్ లంగ్ డిసీజ్’ అనే శ్వాసకోశ సమస్యకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ఇలాంటి కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలీ వ్యాధి ఏంటి.? లక్షణాలు ఎలా ఉంటాయి.? ఎలాంటి చర్యలు తీసుకోవాలి.? లాంటి వివరాలు తెలుసుకుందాం. బర్డ్‌ బ్రీడర్‌ లంగ్‌ డిసీజ్‌ అనే వ్యాధిని ఏవియన్ హైపర్సెన్సిటివిటీ న్యూమోనిటిస్ అని కూడా పిలుస్తారు. కోళ్ల ఫారాలల్లో పనిచేసే వారికి, కోళ్ల దుకాణాల్లో పనిచేసే వారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోళ్లు, పక్షుల విసర్జిత పదార్థాల దుమ్ము, ఈకల ధూళీకి ఎక్స్‌పోజ్ కావడం వల్ల వ్యాపిస్తోందని నిపుణులు చెప్తున్నారు.

ఈ వ్యాధి సోకిన వారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. దగ్గు, జ్వరం, ఛాతి బిగుతుగా అనిపించడం, అలసటగా ఉంటుంది. ఈ లక్షణాలు వెంటనే కాకుండా ఏళ్ల వ్యవధిలో కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువకాలం ఇలాంటి వాటికి ఎక్స్‌పోజ్‌ అయితన వారిలో లంగ్ టిష్యూ డ్యామేజ్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే వారు పక్షులు, కోళ్లకు దూరంగా ఉండడమే బెటర్‌. ఒకవేళ వృత్తిపరంగా ఉండాల్సి వస్తే కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..