Blood Group: భార్యాభర్తల బ్లడ్ గ్రూప్ ఒక్కటే అయితే ఏం జరుగుతుంది?

|

Sep 08, 2023 | 4:51 PM

రక్తంలో గ్రూపులు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ, బీ, ఓ, ఏబీ అనే నాలుగు రకాల బ్లడ్ గ్రూపులు ఉంటాయి. అలాగే రక్తంలో ఆర్ హెచ్ అంటిజెన్ అని ఉంటుంది. ఇది ఉన్న వారు పాజిటివ్ బ్లడ్ ఉంటుంది. అంటే ఏ పాజిటివ్, బీ పాజిటివ్, ఓ పాజిటీవ్, ఏబీ పాజిటివ్ ఇలా ఉంటాయి. లేని వారికి నెగిటివ్ బ్లడ్ ఉంటుంది. ఏ నెగిటివ్, బీ నెగిటివ్, ఓ నెగిటివ్, ఏబీ నెగిటివ్ అని ఉంటాయి. పాజిటివ్, నెగిటివ్ ల బట్టి ఎవరికి ఎలాంటి రక్తం అవసరమో.. అలాంటి వారికి అదే బ్లడ్ గ్రూప్ ఉన్న రక్తాన్ని ఎక్కిస్తారు వైద్యులు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన..

Blood Group: భార్యాభర్తల బ్లడ్ గ్రూప్ ఒక్కటే అయితే ఏం జరుగుతుంది?
Blood Group
Follow us on

రక్తంలో గ్రూపులు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ, బీ, ఓ, ఏబీ అనే నాలుగు రకాల బ్లడ్ గ్రూపులు ఉంటాయి. అలాగే రక్తంలో ఆర్ హెచ్ అంటిజెన్ అని ఉంటుంది. ఇది ఉన్న వారు పాజిటివ్ బ్లడ్ ఉంటుంది. అంటే ఏ పాజిటివ్, బీ పాజిటివ్, ఓ పాజిటీవ్, ఏబీ పాజిటివ్ ఇలా ఉంటాయి. లేని వారికి నెగిటివ్ బ్లడ్ ఉంటుంది. ఏ నెగిటివ్, బీ నెగిటివ్, ఓ నెగిటివ్, ఏబీ నెగిటివ్ అని ఉంటాయి. పాజిటివ్, నెగిటివ్ ల బట్టి ఎవరికి ఎలాంటి రక్తం అవసరమో.. అలాంటి వారికి అదే బ్లడ్ గ్రూప్ ఉన్న రక్తాన్ని ఎక్కిస్తారు వైద్యులు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి.

పిల్లల్లో లోపాలు:

అయితే కొంత మంది భార్య భర్తలు ఒకే రకమైన బ్లడ్ గ్రూప్ ని కలిగి ఉంటారు. ఇలా భార్య భర్తలు ఇద్దరూ ఒకే రకమైన బ్లడ్ గ్రూప్ కలిగి ఉంటే అనేక రకాల సమస్యలకు గురవ్వాల్సి వస్తుందని, పుట్టే పిల్లల్లో లోపాలు ఉంటాయని, అలాగే గర్భం దాల్చే సమయంలో ఆలస్యం అవుతుందని ఇలా చాలా రకాల సందేహాలు ఉంటాయి. వీటిలో నిజమెంత? ఇవి అపోహలా? లేక నిజాలా? నిపుణుల సలహాలు, సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

భార్యా భర్తలిద్దరూ వేరు వేరు బ్లడ్ గ్రూపుల కంటే.. ఒకే రకమైన బ్లడ్ గ్రూప్ ఉంటే చాలా బెస్ట్ అని నిపుణులు అంటున్నారు. అదే దంపతులు వేరు వేరు బ్లడ్ గ్రూపులను కలిగి ఉంటే.. పుట్టే పిల్లలు ఇన్ కంపాటిబిలిటీ అనే సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో పుట్టే పిల్లలు కామెర్లతో, పలు అనారోగ్య సమస్యలతో పుడతారని అంటున్నారు.

అలాగే భార్య భర్తలిద్దరిలో పాజిటివ్, నెగిటివ్ అనే బ్లడ్ గ్రూప్స్ ఉంటే.. ఆర్ హెచ్ కంపాటిబిలిటీ అనే సమస్య వస్తుందట. దీని వల్ల పుట్టే పిల్లల్లో కామెర్ల సమస్యతో పాటు రక్తాన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

ఒకే బ్లడ్ గ్రూప్ అయితేనే సేఫ్:

కాగా ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు.. గర్భాధారణ సమయంలోనే యాంటీ డీ అనే ఇంజెక్షన్ ను ఇస్తారు. అలాగే తల్లిది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయ్యి.. బిడ్డకు పాజిటివ్ బ్లడ్ గ్రూపు కలిగి ఉంటే.. బేబీ పుట్టిన తర్వాత 72 గంట్లోనే ఈ యాంటీ డీ అనే ఇంజెక్షన్ ను ఇస్తారు. అయితే మొదటి కాన్పులో ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువ కానీ.. రెండో కాన్పులోనే మాత్రం చాలా జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. అదే భార్యా భర్త ఇద్దరూ ఒకే బ్లడ్ గ్రూపును కలిగి ఉంటే.. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉండని వెల్లడిస్తున్నారు నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి