Babies Crying: పసిపిల్లలు ఎక్కువగా ఎందుకు ఏడుస్తారు..? చైల్డ్‌ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారు..?

|

Jan 15, 2021 | 2:43 PM

Babies Crying: పసిపిల్లలు ఎక్కువగా ఏడుస్తుండటం సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో ఏకంగా గంటల పాటు ఏడుస్తుంటారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులకు కూడా పిల్లలు ఎందుకు..

Babies Crying: పసిపిల్లలు ఎక్కువగా ఎందుకు ఏడుస్తారు..? చైల్డ్‌ సైకాలజీ నిపుణులు ఏమంటున్నారు..?
Follow us on

Babies Crying: పసిపిల్లలు ఎక్కువగా ఏడుస్తుండటం సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో ఏకంగా గంటల పాటు ఏడుస్తుంటారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులకు కూడా పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారనే విషయం అర్థం కాదు. ఏడుపును మార్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినా వారు ఏడుపు ఆపరు. పిల్లలు రోజుకు మూడు గటల పాటు ఏడుస్తారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పిల్లలు ఏడవడం వల్ల కూడా ప్రయోజనం ఉందని చైల్డ్‌ సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. అలా ఏడవడమే వారి భాషగా మారుతుంది. పిల్లలు ఏడవడంలో ఎన్నో అర్ధాలు ఉన్నాయని, వాటిని తల్లిదండ్రులు గమనించాలని పిల్లల వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏడవడం ద్వారానే పిల్లలు వారికి కావాల్సినవి తెలియజేస్తారు. పిల్లలకు ఆకలిగా ఉన్నప్పుడు కొంచెం పెద్దగా మధ్యలో విరామం ఇవ్వకుండా ఏడుస్తారు. అలాగే పిల్లలకు అసౌకర్యంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను హడలు కొట్టించేలా బిగ్గరగా ఏడుస్తూనే ఉంటారు. ఇలా విడవని ఏడుపునకు ఏ కడుపునొప్పో, చెవినొప్పో కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాంటి సమయంలో వారిని వెంటనే పిల్లల వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పిల్లలు ఏమీ తోచక తల్లిదండ్రులను వాళ్ల దగ్గరకు రప్పించుకోవాలనే భావంతో కూడా ఏడుస్తారని, ఇలా ఏడ్చేది తాపీగా మధ్య మధ్యలో అపుతూ ఉ..ఊ అంటూ ఏడుస్తారు. ఇలాంటి ఏడుపును పసిగట్టిన తల్లులు వెంటనే ఉయ్యాల దగ్గరకు వెళ్లి ఎత్తుకుని ఆడించకుండా నాలుగైదు నిమిషాలు ఆగి వెళ్లాలి. లేకపోతే చంటిపిల్లలైనా అదే అలుసుగా తీసుకుని పదే పదే ఏడుస్తూనే ఉంటారు.

ఇంకా చాలా కారణాల ఏడుపును గ్రహించగలగాలి. ఈ తేడాలను గుర్తించలేకపోయినా తల్లులు వెంటనే స్పందించి వారెందుకు ఏడుస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ లాలిస్తే, తల్లి తనను కనిపెట్టుకునే ఉందనే ఆత్మవిశ్వాసం కలుగుతుందని బాలల మనస్తత్వ శాస్త్ర వేత్తలు అభిప్రాయపడుతున్నారు. చంటి పిల్లలకు ఒకటి, రెండు నెలల నుంచే తల్లి ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ఏడ్చిన వెంటనే లాలిస్తూ, బుజ్జగిస్తూ.. సన్నగా పాటపాడుతూ ఏడుపుమాని నిద్రపోయేలా చేయాలి. సన్నగా సంగీతాన్ని వినిపించడం వల్ల కూడా పిల్లలు ఏడుపుమాని నిద్రలోకి జారుకుంటారు. అతిగా ఏడుస్తూ నిద్రపోని పిల్లలను డాక్టర్ కు చూపించాలని వారు సూచిస్తున్నారు.

Also Read: బ్యాచిలర్లూ తస్మాత్ జాగ్రత్త! ఆ వ్యాధి ముప్పు అధికమేనట.. హెచ్చరిస్తున్న పరిశోధకులు..