Feet Pain Tips: మీకు ఊరికే కాలు జారుతుందా.. అయితే ఈ సమస్యలు ఉన్నట్లే!!

|

Jul 29, 2023 | 2:19 PM

కండరాల బలహీనత, పోలియో, అమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్, పెరిఫెరల్ నరాల సమస్యలు వంటి కారణాల వల్ల కండరాల బలహీనత, నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల ఫుట్ డ్రాప్ వస్తుంది. వెన్నుపాము దెబ్బతినడం, వెన్నుపూస సమస్యల కారణంగా..

Feet Pain Tips: మీకు ఊరికే కాలు జారుతుందా.. అయితే ఈ సమస్యలు ఉన్నట్లే!!
Feet Pain
Follow us on

అటు ఇటూ నడుస్తుండగా ఊరికే కాలు జారుతుందా.. అప్పుడప్పుడు ఉన్నట్టుండి పడిపోతున్నారా.. అయితే మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నట్లే. సాధారణంగా పాదం ముందు భాగాన్ని ఎత్తడంలో ఇబ్బంది ఉంటే దాన్ని ఫుట్ డ్రాప్ అని పిలుస్తారు. కొన్ని సార్లు దీన్ని డ్రాప్ ఫుట్ అని కూడా పిలుస్తూంటారు. మీకు ఫుట్ డ్రాప్ సమస్య ఉంటే.. మీ పాదల ముందు భాగం నేలపై జారే అవకాశం ఉంది. అయితే ఇదేమీ పెద్ద అనారోగ్యం కాదు. లోతైన శరీర నిర్మాణ సంబంధమైన సమస్యలు ఉంటే.. ఈ లక్షణం కనిపిస్తూ ఉంటుంది.

కండరాల బలహీనత, పోలియో, అమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్, పెరిఫెరల్ నరాల సమస్యలు వంటి కారణాల వల్ల కండరాల బలహీనత, నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల ఫుట్ డ్రాప్ వస్తుంది. వెన్నుపాము దెబ్బతినడం, వెన్నుపూస సమస్యల కారణంగా కూడా పాదాల కదలికను నియంత్రించే నరాలపై ప్రభావం పడుతుంది. దీని వలన ఫుట్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ డ్రాఫ్ ఫుట్ కి నివారణ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి
  • రెగ్యులర్ వ్యాయామం, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, డయాబెటీస్, పెరిఫెరల్ న్యూరోపతి వంటి పరిస్థితులను నివారిస్తే ఫుట్ డ్రాప్ తగ్గుతుంది. కాళ్లు జారే ప్రమాదం తగ్గుతుంది.
  • ఒకే భంగిమలో కూర్చోవడం, కాళ్ల కండరాలపై ఎక్కువ సేపు ఒత్తిడి ఉంచడం వంటివి ఫుట్ డ్రాప్ కు దారి తీస్తాయి.
  • సరైన పాదరక్షలను ధరిస్తే కాలు జారిపోయే సమయంలో గాయాలు కాకుండా సహాయపడతాయి.
  • ఇంట్లో ట్రిప్పింగ్ ప్రమాదాలను తగ్గించడం, హ్యాండ్ రెయిల్ లు, గ్రాబ్ బార్ లు వంటి సహాయక పరికరాలను ఉపయోగించాలి.
  • కాలు, పాదం కండరాలను బలోపేతం చేయడానికి వ్యాయామాలు చేయండి. స్ట్రేచ్చింగ్ ఫుట్ డ్రాప్ ను తగ్గించడానికి సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి