Nipah Virus: కరోనా మహమ్మారితో పోరాడుతున్న కేరళకు నిపా వైరస్ తలనొప్పిగా మారింది. దీంతో రాష్ట్ర ప్రజలు అయోమయంలో బతుకుతున్నారు. ఓ వైపు కరోనా నిబంధనలు పాటిస్తూనే మరోవైపు నిపా వైరస్‌తో కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 2018 సంవత్సరంలో కేరళలోని ఉత్తర కోజికోడ్‌లోని ఒక గ్రామంలో మొదటిసారిగా నిపా వైరస్ సోకిన రోగులను గుర్తించారు. ఈ సమయంలో దీనిపై అవగాహన లేకపోవడంతో వారు మరణించారు. నిపా వైరస్ గబ్బిలం, పంది ద్వారా వ్యాపిస్తుంది.
ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు, మానవుల నుంచి మానవులకు కూడా వ్యాపిస్తుంది. నిపా వైరస్ వల్ల ఏ వయస్సు వారు ఎక్కువగా ప్రభావితమవుతారో ఒక్కసారి తెలుసుకుందాం. నిపా వైరస్ వెనుక ప్రధాన కారణం గబ్బిలాలు. ఇవి తిన్న పండ్లను, ఆహారపదార్థాలను జంతువులు కానీ మనుషులు కానీ తింటే ఈ వైరస్ సోకుతుంది. అప్పుడు ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ అంటు వ్యాధి కావడంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉంది. నిపా వైరస్ లక్షణాలు ఏమిటి.. ఏ వయస్సు ప్రజలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారనే దానిపై ఎయిమ్స్ డాక్టర్ పియూష్ రంజన్ మాట్లాడారు.
కోవిడ్ వైరస్‌లో ప్రధాన లక్షణాలు జలుబు, దగ్గు, ముక్కు కారటం, శ్వాస ఆడకపోవడం ఉన్నాయి. ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించినవి. అయితే నిపా వైరస్ లక్షణాలు శ్వాసకోశ వ్యవస్థకు సంబంధినవాటితో పాటుగా అధిక జ్వరం కూడా ఉంటుంది. ఇంచు మించు రెండు వైరస్‌ల లక్షణాలు ఒకే మాదిరిగా ఉంటాయని చెప్పారు. ఒక పండును గబ్బిలాలు తింటే వైరస్ పండ్లలోకి వస్తుంది. ఈ పండును తింటే ప్రజలు వ్యాధి బారిన పడవచ్చు. నిపాకు ఇంకా వ్యాక్సిన్ లేదు. ఈ వైరస్ వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా రావొచ్చు. కానీ ఇది చాలా ప్రమాదకరం.
12 ఏళ్ల బాలుడు మరణించాడు
కేరళలోని కోజికోడ్‌లో నిపా వైరస్ కారణంగా 12 ఏళ్ల చిన్నారి మరణించిన తర్వాత రాష్ట్రంలో భయాందోళనలు నెలకొన్నాయి. కానీ ఇటీవల కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. నిపా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన 12 ఏళ్ల చిన్నారిని సంప్రదించిన 61 మందికి టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చిందని తెలిపారు.
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..