Weight Loss Tips: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితే లేకుండా పోతోంది. తిండి తినే సమయం లేక.. లేట్ నైట్ స్లీపింగ్స్ వెరసి అనారోగ్యం బారినపడిపోతున్నారు. చాలా మంది ఈ కారణంగా ఊబకాయం, స్థూలకాయం వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. అధిక బరువుతో అవస్థలు పడుతున్నారు. చాలా మంది ఈ బరువును తగ్గించుకునేందుకు వర్కౌట్స్ చేస్తుంటారు. డైట్ మెయింటేన్ చేస్తుంటారు. అలాగే, జిమ్‌కి వెళ్లి తెగ ప్రయాస పడిపోతుంటారు. అయితే, బరువు తగ్గాలనుకునే వారు.. జిమ్ కి వెళ్లి తెగ ప్రాయస పడాల్సిన అవసరం లేదని, మనం తినే ఆహారాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును.. కొన్నిరకాల ఆహారాలు డైట్‌లో చేర్చుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. మరి ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తృణధాన్యాలతో చేసిన రొట్టెలు: సహజనమైన పోషకాలు కలిగిన తృణధాన్యాల పిండితో తయారు చేసిన రొట్టెలను తినాలి. ఇది శరీర బరువు నియంత్రణలో ఉంచేలా సహకరిస్తుంది. హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఫైబర్‌ను అందిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను మెరుగుపరుస్తుంది. చాలాసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
బ్రౌన్ రైస్: వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
సీజనల్ ఫ్రూట్: డెజర్ట్ కాకుండా ఏదైనా తీపి తినాలనుకుంటే డెజర్ట్‌కు బదులు పండ్లను తినొచ్చు. ఫలితంగా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి.