Weight Loss Soup: బరువును తగ్గించే టేస్టీ సూప్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా!

|

Oct 20, 2023 | 9:18 PM

సూప్ చాలా హెల్దీ. టేస్టీతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే సూప్ తప్పనిసరిగా తాగాలి. సూప్ తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా హెల్దీగా ఉంచుతుంది. అందుకే హోటల్స్ లో ముందు సూప్ తాగుతారు. ఈ సూప్ తాగడం వల్ల ఒక్కటేంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కొన్ని రకాల సూప్స్ టేస్ట్ ని ఇస్తే.. మరి కొన్ని సూప్స్ టేస్ట్ తో పాటు హెల్దీని కూడా ఇస్తుంది. వాటిల్లో లెమన్ కొరియాండర్ సూప్ కూడా ఒకటి. నిమ్మ రసం, కొత్తి మీరతో చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. వాతావరణం మారినప్పుడల్లా ఈ సూప్ తాగితే..

Weight Loss Soup: బరువును తగ్గించే టేస్టీ సూప్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా!
Soups
Follow us on

సూప్ చాలా హెల్దీ. టేస్టీతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే సూప్ తప్పనిసరిగా తాగాలి. సూప్ తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా హెల్దీగా ఉంచుతుంది. అందుకే హోటల్స్ లో ముందు సూప్ తాగుతారు. ఈ సూప్ తాగడం వల్ల ఒక్కటేంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కొన్ని రకాల సూప్స్ టేస్ట్ ని ఇస్తే.. మరి కొన్ని సూప్స్ టేస్ట్ తో పాటు హెల్దీని కూడా ఇస్తుంది. వాటిల్లో లెమన్ కొరియాండర్ సూప్ కూడా ఒకటి. నిమ్మ రసం, కొత్తి మీరతో చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. వాతావరణం మారినప్పుడల్లా ఈ సూప్ తాగితే సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. జ్వరం, జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వాటిని దూరం చేసుకోవచ్చు. ఏదైనా కొంచెం నీరసంగా ఉన్నప్పుడు.. ఈ సూప్ ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ లెమన్ కొరియాండర్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లెమన్ కొరియాండర్ సూప్ కి కావాల్సిన పదార్థాలు:

కొత్తి మీర, నిమ్మ రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, కార్న్ ఫ్లోర్, నూనె, జీలకర్ర.

ఇవి కూడా చదవండి

సూప్ తయారీ విధానం:

ఈ సూప్ ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత సూప్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి వేయించు కోవాలి. ఇది వేగాక నెక్ట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. పచ్చి వాసన పోయేంత వరకూ కలుపుకోవాలి. ఆ తర్వాత క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.

ముక్కలు కాస్త మెత్తగా అయిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సూప్ చిక్కబడుతూ ఉంటుంది. అడుగు అంట కుండా కలుపుతూ ఉండాలి. నెక్ట్స్ కొత్తి మీర వేసి మరో మూడు నిమిషాల పాటు.. చిన్న మంటపై ఉడికించుకోవాలి. తర్వాత నిమ్మ రసం వేసి కలుపు కోవాలి. ఇక స్టవ్ ఆప్ చేసి.. వేడి వేడిగా బౌల్స్ లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లెమన్ కొరియాండర్ సూపర్ రెడీ. ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలి పెట్టరు. ఇంకెందుకు లేట్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి.. ఈ సూప్ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.